ఒక సీరియస్ సినిమా నడుస్తున్నా టైంలో బ్రహ్మానందం వచ్చి కామోడీ చేసినట్లు.. సీరియస్ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా అలాంటిదే అని గతంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పదే పదే పవన్ కళ్యాణ్ తన రాజకీయ అడుగులు బట్టి నిజం చేస్తున్నారు. తన పార్టీ వారికి కష్టం వచ్చినా కాస్త లేట్ అవుతుందేమో గాని పక్క పార్టీ వారు మాత్రం ఇబ్బందుల్లో ఉంటే అస్సలు లేటు చేయకుండా పిడిఎఫ్ లేదా వీడియో రికార్డ్ చేసి ట్విట్టర్లో పెట్టే పవన్ కళ్యాణ్ తాజాగా హరీష్ రావు పై ఆంధ్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు
జనసేన ట్విట్టర్ లో రికార్డ్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిసేలా ఏపీ మంత్రులు మాట్లాడడం బాధించిందని.. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఒక వ్యక్తిని విమర్శించాలి తప్ప తెలంగాణ ప్రజలను మధ్యలో ఎందుకు లాగుతున్నారు అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర మంత్రులు ఎక్కడా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలని ఎక్కడ అగౌరపరచలేదు. కేవలం హరీష్ రావు వ్యాఖ్యలపై కౌంటర్లు మాత్రం ఇచ్చారు.
తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా అధికార పార్టీని విమర్శించని పవన్ కళ్యాణ్ కేవలం హరీష్ రావుకు కౌంటర్ ఇవ్వడంతోనే వీడియో రికార్ట్ చేసి మరి వైసీపీ పార్టీపై విమర్శలు చేయడంతో తెలంగాణ ప్రజలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై కూడా పవన్ వీడియోలో ప్రస్తావించింటే బాగుండేదంటూన్నారు వైసీపీ నేతలు.