ఎక్స్ క్లూజివ్ – అనసూయ డబుల్ రోల్

యాంకర్ అనసూయ క్రేజ్ మామూలుగా లేదు. అటు చిన్న తెర మీద ఇటు వెండి తెర మీద కూడా మంచి ఫామ్ లో వుంది.  Advertisement పుష్ప సినిమాలో డిఫరెంట్ రోల్ చేసిన అనసూయ…

యాంకర్ అనసూయ క్రేజ్ మామూలుగా లేదు. అటు చిన్న తెర మీద ఇటు వెండి తెర మీద కూడా మంచి ఫామ్ లో వుంది. 

పుష్ప సినిమాలో డిఫరెంట్ రోల్ చేసిన అనసూయ రాబోయే ఖిలాడీ సినిమాలో డబుల్ రోల్ చేస్తోంది. అందులో ఒక పాత్ర బ్రాహ్మిన్ మహిళ పాత్ర. రెండు పాత్రలు ఏమిటి? ట్విన్స్ నా? మరేంటీ? అన్నది యూనిట్ చాలా క్లోజ్ గా దాచి వుంచింది.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సినిమాలో ఒక పాత్ర చనిపోతుంది అని, రెండో పాత్ర వుంటుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సినిమా పొడవునా అనసూయ కనిపించేది ఖిలాడీనే కావచ్చు. ఈ సినిమాతో అనసూయ కెరీర్ పరంగా మరో మెట్టుపైకి ఎక్కుతుందని టాక్ వినిపిస్తోంది.

రవితేజ‌ హీరోగా కోనేరు హవీష్ నిర్మించిన ఖిలాడీ ఫిబ్రవరి 11న విడుదల కావడానికి రెడీ అవుతోంది. రాక్షసుడు సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రమేష్ వర్మ దర్శకుడు.