పెద్దల విరాళాలపై డేగకన్ను?

ఎన్నికలు వచ్చాయంటే విరాళాల జోరు మొదలవుతుంది. అధికార పార్టీ కే కాదు, కీలకమైన ప్రతిపక్ష పార్టీలకు కూడా బడా సంస్థలు, బడా బాబులు విరాళాలు అందించాల్సి వుంటుంది. Advertisement ఇక మున్సిపల్ ఎన్నికలు అంటే…

ఎన్నికలు వచ్చాయంటే విరాళాల జోరు మొదలవుతుంది. అధికార పార్టీ కే కాదు, కీలకమైన ప్రతిపక్ష పార్టీలకు కూడా బడా సంస్థలు, బడా బాబులు విరాళాలు అందించాల్సి వుంటుంది.

ఇక మున్సిపల్ ఎన్నికలు అంటే డివిజిన్ డివిజన్ లో కూడా విరాళాలు దండేయడం అన్నది వుండనే వుంటుంది. ఇదిలా వుంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో విరాళాల రూపంలో నల్ల డబ్బు చేతులు మారకుండా ఆదాయపన్ను నిఘా వేసిందన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ప్రతి ఎన్నికలకు ఇది మామూలే. 

అయితే హైదరాబాద్ లోని కొందరు పెద్దలపై ఇటీవల వాట్సాప్ లో కొన్ని మెసేజ్ లు చలామణీ అయ్యాయి. వీరు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తే భాజపా చూస్తూ ఊరుకోదని, వారి దగ్గర నుంచి తమ పార్టీ తీసుకోదని అర్థం వచ్చేలా ఈ సందేశాలు అటు ఇటు తిరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పడు ఆదాయపన్ను శాఖ డేగ కన్ను వేసిందన్న మేసేజ్ ల ప్రారంభమయ్యాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నల్లధనం చలామణీపై  చర్యలు తీసుకోవడానికి ఇరవైఐదు ప్రత్యేకబృందాలు రంగంలోకి దిగాయట.  ఈ బృందాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో తమ ఇంఫార్మర్ వ్యవస్థ ద్వారా డేగకళ్ళతో సునిశితంగా పరిశీలించమోతున్నాయట.

నగరంలో ఎన్నికలకు పార్టీలకు నల్లధనాన్ని సమకూర్చే ప్రవహింపచేసే పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు బిల్డర్లు రియల్టర్లు కొర్పొరేట్ ఆసుపత్రులు, ఫైనాన్షియర్లు సినీనిర్మాతలు ప్రయివేటు స్కూళ్ళు కాలేజీలు ఎవరనేది,  ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడ ఈ నల్లధనాన్ని రహస్యంగా ఉంచబోతున్నారు,ఎవరెవరు ఈడబ్బుని పంపిణీ చేయబోతున్నారని ఒక పూర్తి సమగ్రమైన సమాచారాన్ని సేకరించారట.

మొన్నటికి మొన్న దుబ్బాకలో పోలీసులు చాలా యాక్టివ్ గా సొదాలు జరిపారు. డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. పోలీసులకు ఆ అధికారం లేదని, ఆదాయపన్నుశాఖ ఆ పని చేయాలని కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ ముందుగానే మేల్కొని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

ఆదాయపన్ను శాఖ కేంద్రం ఆధీనంలో వుంటుంది. కేసిఆర్ ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేయడం, కేంద్రంలో అధికారంలో వున్న భాజపా సిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడం, ఇవన్నీ చూస్తుంటే ఆదాయపన్ను శాఖ ఈసారి కాస్త గట్టిగానే దృష్టి పెట్టిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిమ్మగడ్డకు నిఖార్సైన ప్రశ్న