వెంకటేష్ తో పోటీకి సై అంటున్న నాని

ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉందంటే, పండగొచ్చిందంటే బాక్సాఫీస్ బరిలో పోటీ తప్పేలా లేదు. చిన్న హీరో, పెద్ద హీరో, సీనియర్-జూనియర్ అనే తేడా లేకుండా అందరికీ ఇప్పుడు పండగ తేదీలే కావాలి.…

ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉందంటే, పండగొచ్చిందంటే బాక్సాఫీస్ బరిలో పోటీ తప్పేలా లేదు. చిన్న హీరో, పెద్ద హీరో, సీనియర్-జూనియర్ అనే తేడా లేకుండా అందరికీ ఇప్పుడు పండగ తేదీలే కావాలి. భారీ ఓపెనింగ్స్ రావాలి. ఈ ఏడాదికి సంబంధించి సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లపై ఆల్రెడీ కొన్ని కర్చీఫ్ లు పడిపోయాయి. దీంతో ఇప్పుడు మేకర్స్ కన్ను క్రిస్మస్ పై పడింది. అంటే.. డిసెంబర్ కు ఇప్పట్నుంచే పోటీ అన్నమాట.

క్రిస్మస్ రేసులో వెంకీ ముందుగా నిలిచాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడీ సినిమాతో పోటీకి నాని రెడీ అయ్యాడు

శౌర్యవ్ అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నాడు నాని. కెరీర్ లో అతడికిది 30వ సినిమా. ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సైంధవ్ కు పోటీగా, డిసెంబర్ 21న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.

సైంధవ్ అనేది పూర్తిగా యాక్షన్ మూవీ. నాని కొత్త సినిమా పూర్తిగా సెంటిమెంట్, డ్రామాతో నిండుకున్న సినిమా. కాబట్టి జానర్స్ పరంగా ఈ 2 సినిమాలకు పోటీ లేదు. కానీ ఆ టైమ్ కు మరో సినిమా రేసులో పడితే మాత్రం.. థియేటర్ల షేరింగ్ దగ్గర సమస్య తప్పదు.

నాని సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెంకీ సినిమా కోసం శ్రద్ధా శ్రీనాధ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. జానర్స్ పక్కనపెడితే, రెండూ డిఫరెంట్ సినిమాలే.