మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన రేఖ విడుదల చేశారు. ఇటీవల తన లాయర్ ద్వారా విడుదల చేసిన వాట్స్అప్ చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ పై కవిత అనుమానం వ్యక్తం చేయడంతో దానికి సమాధానంగా ఐదు పేజీలతో కూడిన మరో లేఖను రిలీజ్ చేశారు. తాను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవిత తోనే అని ఫోన్ నెంబర్స్ తో సహా మరో కొన్ని స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశారు.
సుఖేష్ తాజా లేఖలో కవిత గురించి ప్రస్తావిస్తూ.. నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు, కానీ అందులో మీరు భాగస్వాములే అని కౌంటర్ ఇచ్చారు. కవితను తాను కవితక్క అని పిలుస్తానని, ఆమెను తన పెద్దక్కగా భావించానని.. తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలనే ఈ వాస్తవాలను బయట పెడుతున్నా అని అన్నారు. తెలుగులో చాట్ చేసినందుకు అనుమానం వ్యక్తం చేశారని కానీ తెలుగు, తమిళం తన మాతృ భాషలని ఇంకా అనేక భాషలు మాట్లాడగలనని క్లారిటి ఇచ్చారు. దమ్ము, ధైర్యం ఉంటే తన ఆరోపణలపై జరిగే విచారణకు సహకరించాలంటూ సవాల్ విసిరాడు.
అలాగే తీహార్ జైలు క్లబ్ కు కవిత, కేజ్రీవాల్ కు స్వాగతమంటూ.. ముందు కేజ్రీవాల్ ఆ తరువాత నీ వంతే అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చాడు. గత వారంలో 6 పేజీల లేఖతో పాటు కవితతో చాట్ చేసినా అని చెప్పుకునే స్క్రీన్ షాట్స్ ను తన లాయర్ ద్వారా సుఖేష్ రిలీజ్ చేయడంతో తీవ్ర దూమారం రేగింది. దాంతో కవిత రియాక్ట్ అవుతూ.. సుఖేష్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని..కేసీఆర్ ను ఎదుర్కొలేకే తనపై దాడి చేస్తున్నారని. ఫేక్ చాట్ లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని..తమ కుటుంబాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారని కవిత ఆరోపించిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పటికే సీబీఐ నోటీసులు అందుకున్నా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ అధికారుల ఎదుట హజరవుతున్న నేపథ్యంలో సుఖేష్ తాజా లేఖతో రాజకీయ వేడి మరింత పెరిగింది.