మంచితనం, సినిమా వ్యాపారం రెండూ ఒక ఒరలో సెట్ కావేమో? నిర్మాత అనిల్ సుంకర ఏ సినిమా స్టార్ట్ చేసినా కాస్తో కూస్తో ఓవర్ బడ్జెట్ అవుతూనే వుంటుంది.
మహాసముద్రం సినిమా అలాగే జరిగింది. అఖిల్ ఏజెంట్ సినిమా గురించి చెప్పనక్కరలేదు. టైమ్, బడ్జెట్ ఇలా చాలా విషయాల్లో టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుంది. థాంక్స్ టు డైరక్టర్ సురేందర్ రెడ్డి. ఇప్పుడు అదే అనిల్ సుంకర నిర్మిస్తున్న మరో సినిమా భోళా శంకర్.
ఈ సినిమా షూట్ చకచకా జరుగుతూనే వున్నా, ఇది కూడా ముందు అనుకున్న బడ్జెట్ ను ఇప్పటికే దాటేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ సినిమాను ముందుకు ఓ లిమిటెడ్ బడ్జెట్ తో తీయాలనుకున్నట్లు బోగట్టా. కానీ తరువాత తరువాత చేతులు దాటేసిందని వినిపిస్తోంది.
ఓ దశలో కాస్త ఇబ్బంది పడ్డ నిర్మాత అనిల్ సుంకర షూటింగ్ బాధ్యతలు అన్నీ మెగాస్టార్ సన్నిహితుడు ఒకరికి అప్పగించి తాను అమెరికా వెళ్లిపోయారని వినిపిస్తోంది. దాంతో ఖర్చు మరింత పెరిగిందని టాక్.
అయితే అదృష్టం ఏమిటంటే వాల్తేర్ వీరయ్య పెద్ద హిట్ కావడం. ఈ సినిమా నైజాంలో మాంచి కలెక్షన్లు నమోదు చేసింది. మిగిలిన ఏరియాలు, ఓవర్ సీస్ లో కూడా మంచి కలెక్షన్లు కళ్ల చూసింది. అందువల్ల భోళా శంకర్ మార్కెటింగ్ కు అస్సలు సమస్య లేదు. కాస్త డబ్బులు కూడా మిగిలే అవకాశం వుంది. అయితే ఓవర్ బడ్జెట్ కాకుండా వుంటే మరింత ఎక్కువ లాభాలు వస్తాయి.