తండ్రీ కొడుకుల ‘విమానం’

జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి పాత్రల‌తో రూపొందిన చిత్ర‌మే ‘విమానం’. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుందీ సినిమా.  Advertisement…

జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి పాత్రల‌తో రూపొందిన చిత్ర‌మే ‘విమానం’. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుందీ సినిమా. 

విమానం సినిమాలో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ స‌ముద్ర ఖని అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో న‌టించారు. వ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

విమానం ప్రోమోను శుక్ర‌వారం విడుద‌ల చేశారు. విడుదల చేసిన ప్రోమోలో తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధం క‌నిపిస్తుంది. రాజు అనే అనే అబ్బాయి త‌న తండ్రి పాత్ర‌లోని స‌ముద్ర ఖ‌నితో మాట్లాడుతూ.. ఓసారైనా త‌న‌ని విమానం ఎక్కించ‌మ‌ని అడుగుతుంటాడు. 

విమానం ఎక్కటానికి ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్న‌గా క‌నిపిస్తాయ‌ని అంటాడు. అయితే బాగా చ‌దువుకుంటే పెద్ద‌య్యాక నువ్వే విమానం ఎక్కొచ్చ‌ని తండ్రి అంటాడు. ఇందులో సున్నితంగా, చ‌క్క‌గా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న భావోద్వేగాల‌ను ప్రోమోలో చ‌క్క‌గా ఎలివేట్ చేశారు రైట‌ర్, డైరెక్ట‌ర్ శివ ప్ర‌సాద్ యానాల‌.

స‌ముద్ర ఖ‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌తో పాటు ఇందులో మీరా జాస్మిన్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 9 గ్రాండ్ రిలీజ్ అవుతుంది.