బిగ్‌బాస్ సీజన్ 4లో టాప్ సెలబ్రిటీలు ఎవరూ పాల్గొనలేదు. కోవిడ్ టైమ్‌లో ప్లాన్ చేసిన షోలో పాల్గొనడానికి ప్రముఖులు ఆసక్తి చూపించకపోవడంతో ఎక్కువగా సోషల్ మీడియా బృందాన్ని తీసుకొచ్చారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నలుగురిలో ఒకడిగా నటించిన అభిజీత్ ఒక్కడే హీరో ఇమేజ్ వున్నోడు. ఇతను హౌస్‌లోకి వెళ్లడమే పీఆర్ టీమ్‌ని రెడీ చేసుకుని వెళ్లాడని ఆరంభంనుంచీ వచ్చిన ఓట్లే తెలియజెప్పాయి.
తనకోసం బయట స్క్వాడ్ పని చేస్తోందని అన్యాపదంగా అతనే పేర్కొన్నాడు కూడా. అంతే కాదు పలుమార్లు నామినేషన్లలోకి వెళ్లడానికి అత్యుత్సాహం చూపించాడు.
అతను ఏమి చేసినా సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఎక్కువ కాగా పీఆర్ టీమ్ గురించిన కథనాలు మీడియాలోను ప్రముఖంగా వచ్చాయి. అయితే రాను రానూ తన స్మార్ట్ బుద్ధితో, వాగ్దాటితో అభిజీత్ అభిమానులను గెలుచుకున్నాడు.
మరోవైపు మిగతా కంటెస్టెంట్లు అయితే సేఫ్ గేమ్ లేదా కెమెరాల కోసం డ్రామా ఆడుతూ వుండడంతో అభిజీత్ అలాంటి వేషాలు వేయకుండా మరింత హైలైట్ అవుతూ వచ్చాడు.
అరియానా, అమ్మ రాజశేఖర్, అవినాష్ లాంటి వాళ్లు అధిక డ్రామాను నమ్ముకుని విజయావకాశాలు చేతులారా చెడగొట్టుకున్నారు. అఖిల్, సోహైల్ లాంటి వాళ్లు యాంగర్ ఇష్యూస్‌తో అభిజీత్‌కి సమవుజ్జీలు కాలేకపోయారు.
దీంతో అభిజీత్ ఇక టైటిల్ గెలవడం కేవలం లాంఛనమే అనుకోవాలి. బిగ్‌బాస్ ఎన్ని విధాలుగా ట్రై చేసినా అతడి సంయమనం బ్రేక్ చేయలేకపోవడం, అతడి స్మార్ట్‌నెస్‌ని ఛాలెంజ్ చేయగల క్రియేటివ్ టీమ్ బిగ్‌బాస్‌కి లేకపోవడంతో మరోసారి టైటిల్ విన్నర్ పరంగా ఎలాంటి సస్పెన్స్ లేకుండా పోయింది.