త్రివిక్రమ్ స్నేహితుడి ఆనందం

త్రివిక్రమ్ అసిస్టెంట్ కమ్ స్నేహితుడు సాయి. ఎప్పుడో కన్నడంలో ఏదో చేసాడు తప్ప తెలుగులో ఏ సినిమా చేయలేదు. పైగా ఎక్కడో ఏదో తేడా వచ్చి త్రివిక్రమ్ క్యాంప్ వదిలేసి బన్నీ దగ్గరకు వచ్చేసి…

త్రివిక్రమ్ అసిస్టెంట్ కమ్ స్నేహితుడు సాయి. ఎప్పుడో కన్నడంలో ఏదో చేసాడు తప్ప తెలుగులో ఏ సినిమా చేయలేదు. పైగా ఎక్కడో ఏదో తేడా వచ్చి త్రివిక్రమ్ క్యాంప్ వదిలేసి బన్నీ దగ్గరకు వచ్చేసి రెండు మూడేళ్లయిపోతోంది.

అప్పటి నుంచి బన్నీ దగ్గర స్క్రిప్ట్ లు వినే పని చేస్తున్నాడు. అయితే బయట జనాలకు తెలిసే పని ఏదీ ఇంత వరకు గట్టిగా చేయలేదు. ఇప్పటికి ఆ చాన్స్ వచ్చింది.

బన్నీ కూతురు అల్లు అర్హ చేసిన అంజలి..అంజలి విడియో కవర్ సాంగ్ నిన్న విడుదలయింది. ఈపాటకు పుల్ టెక్నికల్ టీమ్ అంతా పని చేసారు. అయితే ఈ కో ఆర్డినేషన్ అంతా ఎవరిది? డైరక్షన్ ఎవరిది? అన్న క్యూరియాసిటీ వుండనే వుంది.

దానికి సమాధానమే సాంగ్ టైటిల్ కార్డ్ ల్లో ఆఖరున వేసిన సాయి గోపాల్ రామ్మూర్తి అన్న పేరే దానికి సమాధానం. అతగాడే సాయి.

త్రివిక్రమ్ టీమ్ లో వుంటూ బన్నీ క్యాంప్ లో చేరిన ఇన్నాళ్లకు ఓ వర్క్ లో టైటిల్ కనిపించింది. బన్నీకి నమ్మకం వుంది కాబట్టే టీమ్ లో చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇంతో అంతో ప్రూవ్ చేసుకున్నట్లే. ఇలా కొనసాగితే ఎప్పటికైనా లిఫ్ట్ దొరుకుతుందేమో?