ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా షూట్ ఇంకా ప్రారంభం కాలేదు. మార్చి లో ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి. కానీ ఇప్పటి నుంచే ఈ సినిమా హీరోయిన్ ఎవరు అన్న దాని మీద బోలెడు గ్యాసిప్ లు వున్నాయి.
కానీ ఇప్పటి వరకు వినిపించిన, వినిపిస్తున్న పేర్లేవీ డైరక్టర్ త్రివిక్రమ్ పరిశీలనలో లేవు అని తెలుస్తోంది. చాలా మంది మల్లీ పూజా హెగ్డే అని కూడా రాసేసారు. కానీ పూజా హెగ్డే ను మళ్లీ తీసుకుంటే పోస్టర్ మీద టైటిల్ మార్చినట్లు వుంటుంది తప్ప కొత్త సినిమాలా అనిపించదుగా అనే జోక్స్ కూడా వినిపిస్తున్నాయి.
నిజానికి డైరక్టర్ త్రివిక్రమ్ మనసులో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పక్కన మెరిసిన కియరా అద్వానీ పేరు ప్రస్తుతం పరిశీలనలో వుందని తెలుస్తోంది. ఒకవేళ ఆమె డేట్స్ అవైలబుల్ గా లేకుంటే రష్మిక పేరు కూడా పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే రష్మిక చకచకా తెలుగులో సినిమాలు చేసింది, చేస్తోంది. పైగా హిట్స్ పర్సంటేజ్ కూడా ఎక్కువ. అందుకే అయితే కియారా లేకుంటే రష్మిక కానీ ఎవరో ఒకరు ఎన్టీఆర్ సరసన కనిపించే అవకాశం వుంది.