నిజ జీవితంలో కూడా ‘బ్యాడ్ లక్’ కీర్తి అన్నారంట

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించిన గుడ్ లక్ సఖి ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇందులో కీర్తిసురేష్ ఐరెన్ లెగ్ పాత్రలో నటించింది. ఆమె ఎక్కడుంటే అక్కడ బ్యాడ్ లక్ అని అర్థం.…

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించిన గుడ్ లక్ సఖి ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇందులో కీర్తిసురేష్ ఐరెన్ లెగ్ పాత్రలో నటించింది. ఆమె ఎక్కడుంటే అక్కడ బ్యాడ్ లక్ అని అర్థం. అలాంటి అమ్మాయి జీవితంలో ఎలా గెలిచిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. మరి నిజజీవితంలో కీర్తిసురేష్ కు ఇలాంటి అనుభవాలున్నాయా?

తన కెరీర్ లో ఇలాంటి ఐరెన్ లెగ్ అనుభవాలు చాలా ఉన్నాయంటోంది కీర్తిసురేష్. మరీ ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో తనను బ్యాడ్ లక్ అన్నారని, ఆ రిమార్క్ వల్ల కొన్ని అవకాశాలు కూడా కోల్పోయానని బాధపడుతూ చెప్పుకొచ్చింది.

“కెరీర్ స్టార్టింగ్ లో నేను నటించిన ఓ సినిమా ఆగిపోయింది. ఇక అప్పట్నుంచి అంతా నన్ను బ్యాడ్ లక్ అన్నారు. 2 సినిమాలు కూడా మిస్ అయ్యాయి. నాకు మాత్రమే కాదు, బహుశా ప్రతి హీరోయిన్ కు కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అవమానాలు తప్పవేమో. ఆ అవమానాలా నుంచి బయటపడ్డానికి నాకు మూడేళ్లు పట్టింది.”

ఐరెన్ లెగ్ అనే కామెంట్స్ విన్నప్పుడు చాలా బాధేస్తుందని, కానీ ఆ టైమ్ లో ఏమీ చేయలేమని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. అంతిమంగా మన పనితీరే మనకు సక్సెస్ తెచ్చిపెడుతుందని, అప్పటివరకు అన్ని అవమానాలు భరించాల్సిందేనంటూ చెప్పుకొచ్చింది. మలయాళ సినీ పరిశ్రమలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైనట్టు బయటపెట్టింది కీర్తి.