సుకుమార్ సినిమా అంటే దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్. ఇది ఫిక్స్. సుకుమార్ రైటింగ్స్ అయినా చాలా వరకు దేవీ నే వర్క్ చేస్తారు. సుకుమార్ కు ఏ మాత్రం కనెక్షన్ వున్న సినిమా అయినా దేవీనే వర్క్ చేస్తారు. దేవీ ఎవ్వరికి సరైన వర్క్ ఇచ్చినా ఇవ్వకున్నా, సుకుమార్ సినిమా అంటే మాత్రం ప్రాణం పెట్టేస్తారు.
పుష్ప సినిమా అడియో ఆరంభంలో ఒక్కోపాట వదిలినపుడు అలా అలా వెళ్లాయి. కానీ వన్స్ సినిమా విడుదలయిన తరువాత వైరల్ అయిపోయాయి. ఊ అంటావా.. ఊఊ అంటావా పాట అయితే పక్కా కాపీ అని తెగ హడావుడి జరిగింది. కానీ అదే పాట ఆ సినిమాను ఎక్కడికో తీసుకుపోయింది.
ఇలా మొత్తం మీద దేవీ-సుక్కుల బంధం పెనవేసుకుపోయింది. పుష్ప పార్ట్ 2 కి దేవీ మ్యూజిక్ ఫిక్స్ అనే అనుకోవాలి. అందులో పెద్దగా సందేహపడాల్సింది లేదు. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సుకుమార్ తో నేరుగా సంబంధం లేకపోయినా, ఇండైరెక్ట్ గా సంబంధం వుండబోయే ఓ భారీ సినిమాకు ఏఆర్ రెహమాన్ పని చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం రెహమాన్ పేరు కన్సిడెరేషన్ లో వుంది. సుకుమార్ అడ్డం పడకపోతే ఫిక్స్ అయిపోతుంది.