అదిగో పులి..ఇదిగో తోక

మొత్తానికి చైతన్య..సామ్ విడాకుల మీద నాగార్జున స్పందన అంటూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మీడియాలన్నీ ఊగిపోయాయి.  Advertisement నిజానికి ఎక్కడ మాట్లాడారు..ఎప్పుడు మాట్లాడారు అన్నది వెదికితే ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజుల క్రితం…

మొత్తానికి చైతన్య..సామ్ విడాకుల మీద నాగార్జున స్పందన అంటూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మీడియాలన్నీ ఊగిపోయాయి. 

నిజానికి ఎక్కడ మాట్లాడారు..ఎప్పుడు మాట్లాడారు అన్నది వెదికితే ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజుల క్రితం ఓ డిజిటల్ మీడియాతో మాట్లాడుతూ అని కోట్ చేస్తూ బాలీవుడ్ మీడియా ఈ వార్తను ముందు ప్రచురించింది. అది చూసి ఎన్ డి టి వి లాంటి మేజర్ మీడియా కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా వార్తలు రాసేసింది. 

ఈ రెండూ ఎప్పుడయితే వార్తలు అందించాయో, తెలుగు డిజిటల్ మీడియాలు ఫాలో ఫాలో అన్నాయి. ఓ మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ కమ్ చానెల్ అయితే ఏకంగా ఓ పావుగంట లైవ్ ప్రొగ్రామ్ పెట్టేసింది. 

ఏమిటిదంతా అని యూ ట్యూబ్ మొత్తం గాలించినా ఎక్కడా ఇంటర్వూ విడియో మాత్రం కనిపించలేదు. వెబ్ అంతా గాలించినా సదరు న్యూస్ మాత్రం కనిపించలేదు. 

ఆఖరికి నాగ్ స్పందించి, ఇదంతా బుస్ అని తాను ఎక్కడా అనలేదని ట్వీట్ వేస్తే అప్పుడు అవునా…అని అందరూ మళ్లీ దాన్ని వార్తగా వేయడం ప్రారంభించారు.