సూపర్ హిట్టయిన బాహుబలి కథను ఆ సినిమా దర్శకుడు రాజమౌళి 20 ఏళ్ల కిందటే రాసుకున్నాడా? తన తండ్రితో కలిసి కూర్చొని 2 దశాబ్దాల కిందటే ఆ కథకు ఓ రూపు తీసుకొచ్చాడా? అవుననే అంటున్నాడు నటుడు రాజీవ్ కనకాల.
“బాహుబలిలో జనాలు చూసిన సీక్వెన్సులు కొన్ని నాకు స్టూడెంట్ నంబర్-1 సినిమా టైమ్ లోనే రాజమౌళి చెప్పాడు. కొన్ని ఫైట్ సీక్వెన్సులు, హీరో ఎలివేషన్ కు సంబంధించిన ఎపిసోడ్స్ కొన్ని అప్పుడే రాసిపెట్టుకున్నాడు జక్కన్న.”
చాలా ఏళ్ల కిందటే బాహుబలి కథను రాజీవ్ కనకాలకు వినిపించాడట రాజమౌళి. కేవలం బాహుబలి అనే కాకుండా.. చాలా విషయాలు తనతో డిస్కస్ చేస్తాడని అంటున్నాడు. ఓపిగ్గా వినేవాళ్లు ఉండాలి కానీ చాలా సీన్స్ ను నీట్ గా వివరిస్తాడని చెబుతున్నాడు.
రాజమౌళి సీరియల్స్ చేస్తున్నప్పట్నుంచి రాజీవ్ కనకాలతో పరిచయం ఉంది. అప్పట్లోనే సాయంత్రమైతే ఇద్దరూ స్టోరీ డిస్కషన్స్ చేసుకునే వాళ్లంట. ఆ తర్వాత చాలా సినిమాల్లో రాజమౌళి తనకు మంచి పాత్రలిచ్చాడని రాజీవ్ కనకాల గుర్తుచేసుకున్నాడు.
అంతేకాదు.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ''ఆర్ఆర్ఆర్''లో కూడా రాజీవ్ కనకాల ఉన్నాడు. సినిమాలో తన పాత్ర చాలా చాలా కీలకమంటున్న కనకాల.. క్యారెక్టర్ డీటెయిల్స్ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు.