సెప్టెంబర్ మాసం.. 2 సినిమాల కోసం..!

కరోనా ఏడాదిని మినహాయిస్తే, సెప్టెంబర్ మాసం ఎప్పుడూ టాలీవుడ్ ను నిరాశపరచలేదు. కనీసం ఒక్క హిట్టయినా ఉంటుంది. ఒకే ఒక జీవితం, లవ్ స్టోరీ లాంటి సినిమాలు సెప్టెంబర్ నెలల్లోనే వచ్చాయి. ఈ ఏడాది…

కరోనా ఏడాదిని మినహాయిస్తే, సెప్టెంబర్ మాసం ఎప్పుడూ టాలీవుడ్ ను నిరాశపరచలేదు. కనీసం ఒక్క హిట్టయినా ఉంటుంది. ఒకే ఒక జీవితం, లవ్ స్టోరీ లాంటి సినిమాలు సెప్టెంబర్ నెలల్లోనే వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబర్ కూడా టాలీవుడ్ కు కాస్త కలిసొచ్చిందనే చెప్పాలి. 25 సినిమాలు రిలీజ్ అయితే, 2 ఆకర్షించాయి.

సెప్టెంబర్ 1న ఖుషి రిలీజైంది. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ అవ్వగా, నైజాంలో సూపర్ హిట్టయింది. అటు తమిళనాట కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు వచ్చిన ఓ 2 చిన్న సినిమాలు ఇలా రిలీజై, అలా ఫ్లాప్ అయ్యాయి.

ఆ తర్వాత వారం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి థియేటర్లలోకి వచ్చింది. ఓవైపు థియేటర్లలో ఖుషి సినిమా, మరోవైపు జవాన్ రిలీజ్. ఈ రెండు సినిమాల్ని తట్టుకొని నిలబడింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓవర్సీస్ తో పాటు, ఓవరాల్ గా హిట్టయింది. గ్యాప్ ఇవ్వకుండా నవీన్ పొలిశెట్టి చేసిన ప్రచారం, ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో పాటు జవాన్ సినిమా కూడా తెలుగులో క్లిక్ అయింది. సెమీ-అర్బన్, మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఆ వారం హిట్టయిన సినిమాలు ఈ రెండు మాత్రమే.

రెండో వారంలో ఛాంగురే బంగారురాజా, రామన్న యూత్, అను, మార్క్ ఆంటోనీ, సోదర సోదరీమణులారా లాంటి సినిమాలు రిలీజయ్యాయి. ఇవన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. ఇదే వారం బిచ్చగాడు సినిమా రీ-రిలీజ్ అయింది. దాని ప్రభావం కూడా పెద్దగా పడలేదు. తెలుగులో వరుసగా ఫ్లాపులిస్తున్న విశాల్, ఈసారి కూడా నిరాశపరిచాడు. మార్క్ ఆంటోనీ తెలుగు రాష్ట్రాల్లో ఆడలేదు. ఈ వారం ఫ్లాప్ అయిన సినిమాల్లో హీరో రవితేజ నిర్మించిన ఛాంగురే బంగారురాజా కూడా ఉంది.

మూడో వారంలో కూడా చాలా సినిమాలొచ్చాయి కానీ ఏదీ నిలబడలేదు. రుద్రంకోట, అష్టదిగ్బంధనం లాంటి సినిమాలకు భారీగా ప్రచారం చేసినప్పటికీ ఆడలేదు. ఇక కన్నడలో సూపర్ హిట్టయిన సప్త సాగరాలు దాటి అనే సినిమా, తెలుగులో ఆ సక్సెస్ ను రిపీట్ చేయలేకపోయింది. ఈ సినిమా టాలీవుడ్ లో కూడా హిట్టవుతుందని భావించిన పీపుల్ మీడియా సంస్థ లెక్క తప్పింది.

ఇక సెప్టెంబర్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. స్కంద, చంద్రముఖి-2, పెదకాపు-1 సినిమాలొచ్చాయి. వీటిలో చంద్రముఖి-2 క్లియర్ ఫ్లాప్. టాలీవుడ్ ఆడియన్స్ ను ఇది ఎట్రాక్ట్ చేయలేదు. స్కంద, పెదకాపు-1 సినిమాలపై ప్రస్తుతానికి మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాల అసలు రంగు బయటకొస్తుంది.