ఒకసారి మందు అలవాటైన వాళ్లు, తాగకుండా వుండలేరు. అవకాశం దొరికినపుడల్లా తాగడం లేదా, అందుబాటులో వున్నపుడల్లా తాగడం ఇదే కార్యక్రమం గా వుంటుంది. టాలీవుడ్ లో మందు అలవాటు లేని వాళ్లు అరుదుగా వుంటారు. అలవాటు వున్నా, తమ లిమిట్ లో తామున్నవారు వున్నారు. లిమిట్ అనేది వుంది, వుంటుంది అన్న సంగతి తెలియని వారు వున్నారు.
వీళ్ల సంగతి అలా వుంచితే ఓ చిన్న నటి అనాలో, చిన్న హీరోయిన్ అనాలో తెలియని ఓ యాక్ట్రెస్ కు మాత్రం వింత అలవాటు వుందని ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది. ఒక చిన్న సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా వచ్చి, ఆ తరువాత పెద్దగా నిలదొక్కుకోలేకపోయిన నటి ఒకరు వున్నారు. ఆ మధ్య ఓ టీవీ షో లో కూడా కాస్త చబ్బీగా మారి తళుక్కున మెరిసింది.
ఏమిటి ఇలా బొద్దు గుమ్మగా మారింది అనుకున్నారు చాలా మంది. కానీ ఆమెకు ఓ వింత అలవాటు వుందని గ్యాసిప్ వినిపిస్తోంది. మందు ముందు కూర్చుంటే గంటలు గంటలైనా గడిచిపోతాయి కానీ, గ్లాసు పక్కన పెట్టదని టాక్. కానీ అలా అని మందుకు బానిస కాదట. ఆ తరువాత కొన్ని రోజుల పాటు మందుకు దూరంగా వుండగలదట. కానీ మళ్లీ ఎప్పుడైనా మందు ముందుకు వస్తే మాత్రం గంటలకు గంటలు సునాయాసంగా గడిచిపోతాయట.
మనిషికో అలవాటు లేదా, మనిషి ఓ టైపు మహిలో సుమతీ అనాలేమో?