యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు. ఈ వారం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పిక్సెల్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాఘవ లారెన్స్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
అమ్మ..అన్న పాయింట్ నచ్చి..
మీ అందరికీ తెలుసు నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. రుద్రుడు మదర్ సెంటిమెంట్ ఫిల్మ్. అలాగే నేను ప్రతీ సినిమాలో ఏదో ఒక మంచి సందేశం చెబుతాను. రుద్రుడులో అమ్మా నాన్నల గురించి ఓ మంచి సందేశం వుంది. అలాగే నాకు కావాల్సిన యాక్షన్, కామెడీ, ఫన్, రోమాన్స్ అన్నీ కుదిరాయి. మాస్.. క్లాస్.. ఫ్యామిలీస్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ బేస్డ్ సినిమా రుద్రుడు. అమ్మని ఇష్టపడే వాళ్ళంతా రుద్రుడ్ని ఇష్టపడతారు.
పక్కా కామన్ మ్యాన్ క్యారెక్టర్
ఇందులో ఒక కామన్ మ్యాన్ గా కనిపిస్తా. జీవితంలో ఒక సమస్య తలెత్తుతుంది. ఇది సహజంగా జరుగుతోందని భావిస్తున్న సమయంలో… కాదు ఎవరో కావాలని చేస్తున్నారని తెలుస్తుంది. అలాంటి సందర్భంలో ఆ సామన్యుడు ఎదురు తిరిగితే ఎలా వుంటుందనేది నా పాత్ర. ఐటీ ఉద్యోగం చేసే ఒక కామన్ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపిస్తా. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిని పరిస్థితులు ఎలా మాస్ గా మార్చాయి? అనేది ఇందులో చాలా ఆసక్తికరంగా వుంటుంది.
నిర్మాత..దర్శకుడు ఒక్కరే
ఈ సినిమా దర్శకుడు కతిరేసన్ నిర్మాత కూడా. ఒక కథ తీసుకొచ్చి దర్శకత్వం చేస్తానని చెప్పారు. నాకు కథ చాలా నచ్చింది. నన్ను కొత్తగా చూపించాలనే తపన నాకు బాగా నచ్చింది. నేను మాస్, డాన్ సినిమాలు చేసినప్పుడు ఒక కేటగిరీ. కాంచన టచ్ చేసిన తర్వాతే అదే నాలుగు పార్టులుగా వచ్చింది. దాని నుంచి బయటికి రావాలంటే మంచి కంటెంట్ కావాలి. అలాంటి మంచి కంటెంట్ తీసుకొచ్చారు. ఇద్దరం అనుభవాలని పంచుకొని సినిమాని చాలా ఫ్రండ్లీ గా చేశాం.
జివి ప్రకాష్ మెలోడీ
జీవీ ప్రకాష్ కుమార్ తో పనిచేయడం ఇదే మొదటిసారి. నాకు మంచి మెలోడి కావాలని అడిగాను. నా ప్రతి సినిమాలో మాస్ పాటలతో పాటు మంచి మెలోడి సాంగ్స్ వుంటాయి. అలాగే ఇందులో రెండు మెలోడి పాటలు సూపర్ గా ఇచ్చారు. క్లైమాక్స్ ఎమోషనల్ సాంగ్ సూపర్ గా చేశారు. రీమిక్స్ పాట కూడా అద్భుతంగా చేశారు.
సెంటిమెంట్ హీరోయిన్
ఇందులో హీరోయిన్ పాత్ర కూడా చాలా సెంటిమెంట్ తో వుంటుంది. ప్రియా భవాని శంకర్ చేసే సినిమాలు దాదాపు హోమ్లీగా వుంటాయి. ఈ కథకు, పాత్ర కు తను సరైన ఎంపిక. ఈ సినిమాకు ఆమె చాలా ప్లస్. అలాగే శరత్ కుమార్ పాత్ర కూడా చాలా బలమైనంది. సినిమాలో మంచి ఫైట్లు వున్నాయి. అఖండ ఫైట్స్ నాకు చాలా నచ్చాయి. యాక్షన్ కోసమే సినిమా మూడు సార్లు చూశాను. ఆ ఫైట్ మాస్టర్ కావాలని చెప్పాను. శివ మాస్టర్ ఈ కథకు తగ్గట్టు యాక్షన్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతి ఫైట్ లో ఒక ఎమోషన్ వుంటుంది.
చంద్రముఖి 2, జిగర్తండా 2 చేస్తున్నాను. అలాగే లోకేష్ కనకరాజ్ కథ స్క్రీన్ ప్లే తో ఆయన కో డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ నిర్మాత.