వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం న‌డుస్తున్నా వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. స్టీల్ ప్లాంట్ ను ఇప్ప‌ట్లో ప్రైవేటీక‌ర‌ణ చేసే ఉద్దేశ్యం లేద‌ని…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం న‌డుస్తున్నా వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. స్టీల్ ప్లాంట్ ను ఇప్ప‌ట్లో ప్రైవేటీక‌ర‌ణ చేసే ఉద్దేశ్యం లేద‌ని తేల్చి చెప్పింది. 

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు శాఖ స‌హాయ మంత్రి ఫ‌గ్గ‌న్ సింగ్ విశాఖ‌లో మాట్లాడుతూ..   విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై ప్ర‌స్తుతం ముందుకెళ్ల‌డం లేద‌ని.. ప్రైవేటీక‌ర‌ణ కంటే ముందు ఆర్ఐఎన్ఎల్ ను బ‌లోపేతం చేయ‌డంపై ఫోక‌స్ పెట్టినట్లు తెలిపారు. ఈ విషయమై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని..స్టీల్ ప్లాంట్ లో కొన్ని కొత్త విభాగాల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. 

ఇన్ని రోజులు ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉన్న‌ట్లుండి కాస్త త‌గ్గింది. బ‌హుశ ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ణా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా తాజా కేంద్రం నిర్ణ‌యం వల్ల స్టీల్ ప్లాంట్ కార్మికులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

కాగా ఇటీవ‌ల బీజేపీలోకి చేరిన మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడం లేద‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మాట్లాడిన 24గంట‌ల్లోనే కేంద్రం తాజా నిర్ణ‌యం తీసుకుంది.