శాకుంతల తలపై 24 కోట్ల భారం

నిర్మాత దిల్ రాజు లక్ భలే చిత్రంగా వుంటుంది. డిస్ట్రిబ్యూషన్ లో డబ్బులు వస్తే ప్రొడక్షన్ లో డబ్బులు ఖర్చయిపోతుంటాయి. నిర్మాతగా లాభాలు వస్తే పంపిణీలో ఖర్చయిపోతుంటాయి.  Advertisement ఇటీవల నిర్మాతగా బలగం, పంపిణీ…

నిర్మాత దిల్ రాజు లక్ భలే చిత్రంగా వుంటుంది. డిస్ట్రిబ్యూషన్ లో డబ్బులు వస్తే ప్రొడక్షన్ లో డబ్బులు ఖర్చయిపోతుంటాయి. నిర్మాతగా లాభాలు వస్తే పంపిణీలో ఖర్చయిపోతుంటాయి. 

ఇటీవల నిర్మాతగా బలగం, పంపిణీ దారుగా దసరా సినిమాలతో లాభాలు అందుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా శాకుంతలం సినిమా తో కూడా లాభాలు కళ్ల చూస్తే హ్యాట్రిక్ అయిపోతుంది. అయితే ఇది ఏ మేరకు సాధ్యం అన్నదే టాలీవుడ్ ఎదురుచూస్తున్న సంగతి.

నలభై కోట్ల అంచనా బడ్జెట్ తో శాకుంతలం సినిమాను స్టార్ట్ చేసారు దర్శకుడు గుణశేఖర్. ప్రాజెక్ట్ నచ్చి అందులో భాగస్వామిగా చేరారు దిల్ రాజు. ఆ ఇద్దరి మధ్య పెట్టుబడులు, లాభాల ఈక్వేషన్లు ఏమిటన్నది వాళ్లకే తెలియాలి. కానీ ఖర్చు మాత్రం 40 కోట్ల దగ్గర ఆగలేదు. 54 కోట్లకు చేరిపోయినట్లు తెలుస్తోంది. ఇలాంటి టైమ్ లో త్రిడీ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. కేవలం దానికే 10 కోట్లు అదనపు భారం పడింది. దాంతో మొత్తం ఖర్చు 64 కోట్లకు చేరుకుంది.

ఈ తరహా సినిమాల మీద బయ్యర్లకు పెద్దగా నమ్మకం లేకపోవడంతో ఎన్ఆర్ఎ పద్దతి మీద సినిమా తీసుకోవడానికి ముందుకు రాలేదు. దాంతో రిటర్నబుల్ అడ్వాన్స్ ల మీద సినిమాను ఇవ్వాల్సి వచ్చింది. ఒక్క ఓవర్ సీస్ మాత్రమే ఎన్ఆర్ఎ చేసారు. నాన్ థియేటర్, ఇతరత్రా అన్నీ కలిసి 40 కోట్ల వరకు రికవరీ వచ్చింది. మరో 24 కోట్లు రావాల్సి వుంది.

అంటే తెలుగు రాష్ట్రాల నుంచి శాకుంతలం సినిమాకు దాదాపు 50 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తే నిర్మాత డబ్బులు వెనక్కు వస్తాయి. ఆ భారం..బాధ్యత శకుంతలదే.