భువన విజయమ్.. ఇది చాలా డిఫరెంట్ గురూ

ఒక సినిమాపై ఆసక్తి పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ కొత్తగా వుండాలి. సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాలి. సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘భువన విజయమ్' ఈ విషయంలో ఆకట్టుకుంటుంది. Advertisement  భువన విజయమ్' టైటిల్…

ఒక సినిమాపై ఆసక్తి పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ కొత్తగా వుండాలి. సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాలి. సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘భువన విజయమ్' ఈ విషయంలో ఆకట్టుకుంటుంది.

 భువన విజయమ్' టైటిల్ తోనే సగం మార్కులు కొట్టేసింది టీం. తర్వాత వచ్చిన ఫస్ట్ లుక్ , టీజర్, థీమ్ సాంగ్ వాటిని రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన మరో క్రేజీ కంటెంట్ బయటికి వచ్చింది. ఈ కథ ఎంత కొత్తగా వుంటుందో చెప్పింది.

‘బర్త్ అఫ్ భువనవిజయమ్’ వీడియో విషయానికి వస్తే.. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని లైన్స్ వినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. భువనవిజయం టైటిల్ పడటం ఆసక్తికరంగా వుంది. 

ఈ సినిమా రెగ్యులర్ కి భిన్నంగా వుంటుందని ఈ వీడియో చెప్పకనే చెబుతుంది. యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.