‘బింబిసార’ అవుట్..’వీరయ్య’ ఇన్

తమిళ హీరో రజనీ కాంత్ తెలుగు సినిమా సెట్ అయినట్లే. ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎవరో ఒక తెలుగు డైరక్టర్ రజనీతో సినిమా చేసే అవకాశం వుందని. బింబిసార దర్శకుడు మల్లిడి వేణు పేరు…

తమిళ హీరో రజనీ కాంత్ తెలుగు సినిమా సెట్ అయినట్లే. ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎవరో ఒక తెలుగు డైరక్టర్ రజనీతో సినిమా చేసే అవకాశం వుందని. బింబిసార దర్శకుడు మల్లిడి వేణు పేరు దాదాపు అందరు హీరోలతో వినిపించడం మొదలైంది. 

మల్లిడి వేణు బాలయ్య కుటుంబానికి బాగా సన్నిహితం. అందువల్ల బాలయ్యతో సినిమా అని. బింబిసార తరువాత రెండో సినిమా అక్కడే చేయాలి అందువల్ల బింబిసార 2నే వుంటుందని. కాదు కాదు, ఇదిగో ఫోటో, రజనీ కాంత్ తోనే సినిమా అంటూ ఇంకోటి. ఇవన్నీ అలా వుండగానే మెగాస్టార్ తో సినిమా అని ఆఖరికి మరో వార్త.

కానీ వాల్తేర్ వీరయ్య డైరక్టర్ బాబీ మాత్రం చాలా సైలంట్ గా పది పేర్లు వినిపించకుండానే సింపుల్ గా సినిమా లాక్ చేసేసుకున్నారు. రజనీకాంత్ తో దిల్ రాజు నిర్మించే సినిమాకు బాబి దర్శకుడు గా ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చేసాయి. దీనికి ముందు బాబీ పేరు ఏ హీరోతో అన్నది పెద్దగా వినపడలేదు. అంతా సైలంట్ గా జరిగిపోయిందంతే.

కమర్షియల్ టేకింగ్, ఎలివేషన్లు బాబీకి బాగా తెలుసు. అందువల్ల వింటేజ్ చిరు ను చూపించినట్లే రజనీ ని కూడా చూపించే అవకాశం వుంది. ఇప్పటికే వెంకీ అట్లూరి హీరో ధనుష్ తో, వంశీ పైడిపల్లి స్టార్ విజయ్ తో, అనుదీప్ ఓ సినిమా శివకార్తికేయన్ తో సినిమాలు చేసేసారు. ఇప్పుడు తమిళ రంగంలో వెళ్తున్నారు బాబీ.