పేరుకు తగ్గట్టే ఆ పత్రికలో చక్కటి ‘ఆర్గనైజింగ్’ వార్త రావడం , దాన్ని మహాప్రసాదంగా ఏపీలో ఎల్లో మీడియా కళ్లకద్దుకుని ప్రచురించడం జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’లో రాయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎవరి ‘సేవ’ కోసం ఈ తుగ్లక్ రాతలు? ఈ రాతల వెనుక ‘ఆర్గనైజర్’ ఎవరో తెలియని అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్‌ను ‘తుగ్లక్’తో పోలుస్తూ ‘జగ్లక్’ అని అవహేళన చేయడం అంటే ఏపీ ప్రజానీకాన్ని అవమానించడమే.
‘ అమరావతి ప్రాజెక్టును రాజకీయ లబ్ధి పెంచుకోవడానికి, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తన (చంద్రబాబు) మనుషులకు సాయం చేయడానికి ఉపయోగించాలనుకున్నారు. ఓటర్లు ఆయన ఉద్దేశాన్ని కనిపెట్టి నిరుటి ఎన్నికల్లో ఓడించారు. ఇతర తప్పిదాలు కూడా ఆయన పరాజయానికి కారణమయ్యాయి. అయితే దీనర్థం రాజధానిపై జగన్ ఇష్టానుసారం చేయమని కాదు’
అమరావతి ప్రాజెక్ట్‌ను రాజకీయ లబ్ధి పెంచుకోడానికి, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తన మనుషులకు సాయం చేయడానికి ఉపయోగించుకున్నారని, ఓటర్లు ఆయన ఉద్దేశాన్ని కనిపెట్టి ఓడించారని రాస్తూనే, అదే అమరావతిలో రాజధాని కొనసాగించాలనే చెప్పే వాళ్లు, వారితో ఇలాంటి రాతలు రాయించే వాళ్లు తుగ్లక్‌లా? లేక తప్పును సరిదిద్దడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్న జగనా? రాజధానిపై జగన్ ఇష్టానుసారం ఏం చేస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించడం మీ దృష్టిలో తుగ్లక్ పాలనైతే, జగన్ తుగ్లక్కే.
‘ అంతర్జాతీయ రాజధానిని నిర్మించాలన్న యోచనలో ఉన్న నాటి సీఎం చంద్రబాబు.. రాజధానిగా అమరావతికి రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించలేదు. దీనిని సాంకేతిక సాకుగా చూపుతూ.. చంద్రబాబుపై రాజకీయ కక్షతో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు’
అంతర్జాతీయ రాజధాని నిర్మించాలని యోచనలో ఉన్న చంద్రబాబు, రాజధానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించడం మరిచిపోయాడంటున్న ఈ వ్యాస రచయిత దుగ్గరాజు శ్రీనివాసరావు తుగ్లక్కు తమ్ముడిలా ఉన్నాడు. రాష్ట్రపతి ఆమోద ముద్రే వేయించలేని నాయకుడు, అంతర్జాతీయ రాజధాని ఎలా నిర్మించాలనుకున్నాడో ఈ తుగ్లక్ రచయిత కాస్తా వివరించి ఉంటే బాగుండేది.
‘మన దేశంలో ఏ ప్రాజెక్టుల్లోనైనా పాలకులకు సన్నిహితులుగా ఉన్నవారే లబ్ధి పొందుతుంటారు. అమరావతి కూడా ఇందుకు మినహాయింపు కాదు’ ఈ వ్యాస రచయిత విషపు సిరా నుంచి జాలువారిన మరో తుగ్లక్ మాట ఇది. ఒక వైపు అమరావతిలో చంద్రబాబు లబ్ధి పొందాడని అంటూనే, మరోవైపు అక్కడే పాలనంతా కేంద్రీకరించాలని కోరుతున్న ఈ వ్యాస తుగ్లక్ గురించి ఏం మాట్లాడాలి. బాబు తప్పులు చేశారంటూనే, ఆయనకు మినహాయింపు ఇవ్వాలనడంలో మతలబు ఏమిటి?
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలు బట్టలు వేసుకోకుండా రాస్తున్నాయి. ఆ మీడియా సంస్థల దిగంబరత్వాన్ని చూడలేక జనం చస్తున్నారు. ఆ మధ్య జాతీయ జర్నలిస్టు శేఖర్గుప్తాను ఇట్లే ఆంధ్రప్రదేశ్‌లో బట్టలు లేకుండా తిప్పారు. ఆయన అభాసుపాలయ్యాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ‘ ఆర్గనైజర్’ను కూడా అలా తిప్పాలనుకున్నట్టున్నారు.
‘అయ్యా దుగ్గరాజు శ్రీనివాసరావు బట్టలు లేకుండా తిరగాలనే కోరిక మీలో బలంగా ఉంటే ఆ పని చేయండి. అంతే తప్ప ‘ఆర్గనైజర్’తో ఆ పాడు పని చేయించకండి’. ఆ రెండు ఎల్లో పత్రికల్లో జగన్‌పై వచ్చిన తెలుగు కథనాలను చదివితే…ఆ పత్రికను ఎంత బాగా ‘ఆర్గనైజ్’ చేశారో అర్థమవుతోంది. చివరిగా ఒక్కమాట ఆకాశంపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో….జగన్‌పై ఈ వ్యాసం కూడా అలాంటిదే.