ఒకప్పుడు కమిట్ మెంట్ అంటే ఓ మంచి పదం. జీవితం అంటే కమిట్ మెంట్ వుండాలి. ఓ కమిట్ మెంట్ తో పని చేయాలి. ఇలా రకరకాల పాజిటివ్ మీనింగ్ తో ఈ పదం వాడేవారు. కానీ సినిమా ఇండస్ట్రీలో కమిట్ మెంట్ మెంట్ వేరే మీనింగ్ అలవాటైపోయింది.
హీరోయిన్-కమిట్ మెంట్ అనే పదాలను జాయింట్ చేసి నెగిటివ్ సెన్స్ లో వాడడం అలవాటైపోయింది.ఇలాంటి నేపథ్యంలో అదే పాయింట్ తో, అదే మీనింగ్ తో కమిట్ మెంట్ అనే సినిమా వస్తొంది డైరక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా అందిస్తున్న ఈ సినిమాలో తేజస్విని మడివాడ, అన్వేషి జైన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
లైఫ్ ఏర్పడేదే సెక్స్ తో అయినపుడు ఒకరికి లైఫ్ ఇవ్వడానికి సెక్స్ అడిగితే తప్పేంటీ అనే కన్వీనియెంట్ కమిట్మెంట్ లాజిక్ పాయింట్ తో తయారవుతున్న సినిమా ఇది.
ఈ దిక్కుమాలిన లాజిక్ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా టీజర్ విడుదలయింది. ఓటిటి లు ఇలాంటి సినిమాల కోసం రెడీ గా వుంటాయోమో? లేదా యూ ట్యూబ్ ను కాస్త వేడెక్కిస్తుందేమో అన్నట్లుగా వుంది ఈ టీజర్. బల్ దేవ్ సింగ్, నీలిమ నిర్మించే ఈ సినిమాకు నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు.