ఓజీ.. ఇది కూడా షార్ట్ కట్ సినిమానే?

కొన్ని రోజుల కిందటి సంగతి.. అప్పటికే ఒప్పుకున్న సినిమాలన్నీ పక్కనపెట్టి మరీ వినోదాయ శితం రీమేక్ కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి కారణం, సినిమాలో పవన్ వెర్షన్ కేవలం 20…

కొన్ని రోజుల కిందటి సంగతి.. అప్పటికే ఒప్పుకున్న సినిమాలన్నీ పక్కనపెట్టి మరీ వినోదాయ శితం రీమేక్ కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి కారణం, సినిమాలో పవన్ వెర్షన్ కేవలం 20 రోజుల కాల్షీట్లతో పూర్తవుతుంది కాబట్టి. పైగా రీమేక్ సినిమా కాబట్టి షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అయింది.

మరి సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాను పవన్ ఎందుకు ముందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ కూడా వినోదాయ శితం లాజిక్కే వర్కవుట్ అయ్యేలా ఉంది కాబట్టి. 

అవును.. ఓజీ సినిమా కోసం కేవలం 30-35 కాల్షీట్లు ఇస్తే సరిపోతుందని పవన్ కు చెప్పారట దర్శక-నిర్మాతలు. ఈ విషయంలో తెరవెనక త్రివిక్రమ్ అద్భుతంగా ప్లానింగ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే పవన్ వెంటనే ఈ సినిమా చేయడానికి కాల్షీట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. 

ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను స్టార్ట్ చేసిన పవన్, రేపోమాపో ఓజీ సినిమా సెట్స్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ ను ముంబయిలో ప్లాన్ చేశారు. మిగతాదంతా హైదరాబాద్ లోనే పూర్తిచేయబోతున్నారు. 2-3 చిన్న సెట్స్ కూడా వేయబోతున్నారు.

పవన్ కనుక బ్యాక్ టు బ్యాక్ 30 రోజుల కాల్షీట్లు ఇస్తే 5 నెలల్లో సినిమా ఫస్ట్ కాపీని సిద్ధం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. హీరోయిన్ తో డేట్స్ ఇష్యూ ఉండకూడదనే ఉద్దేశంతో, పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే చిన్న హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు ప్రియాంక మోహన్ ను దాదాపు లాక్ చేశారు.