విశాఖ జిల్లా జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా అప్పట్లోనే 45 లక్షల పై దాటింది. ఇపుడు అది అరవై లక్షలకు చేరుకుంటోంది. ఈ నేపధ్యంలో గత పారిశ్రామికంగా కూడా విశాఖ విస్తరిస్తోంది. దానికి తోడు రాజధాని అని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
దాంతో విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 500 కోట్ల రూపాయల నిధులతో ఏలూరు, తాండవ రిజర్వాయర్ల ఆయకట్టును అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
దీని వల్ల రెండున్నర లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని అంచనా వేశారు. అలాగే విశాఖ తాగు నీటి అవసరాలు కూడా పూర్తిగా తీరుతాయి.
తొందరలోనే ఈ అనుసంధానం పనులు ప్రారంభం కానున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేంతవరకూ విశాఖ జిల్లాకు తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విశాఖ వాసులతో పాటు రైతాంగంలో కూడా హర్షం వ్యక్తం అవుతోంది.