సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తోన్న చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్. హాకీ క్రీడ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఒక విధంగా తెలుగులో హాకీ నేపథ్యంలో వస్తున్న తొలిసినిమా ఇదే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఇండియాలోనే అతిపెద్ద, ఉత్తమ హాకీ స్టేడియం అయిన పంజాబ్‌లోని మొహాలి స్టేడియంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' క్లైమాక్స్ సీక్వెన్స్‌లను పూర్తి చేశారు.
భారతదేశపు టాప్ హాకీ ఫిలిమ్స్ అయిన 'చక్ దే ఇండియా', 'సూర్మ' షూటింగ్‌లను జరిపింది ఈ స్టేడియంలోనే . ఈ క్లయిమాక్స్ షూట్ కోసం సందీప్ కిషన్ ప్రత్యేకంగా హాకీ శిక్షణ తీసుకోవడం విశేషం.
క్లైమాక్స్ పూర్తయిన సందర్భంగా హీరో సందీప్ కిషన్ ఓ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆరు నెలు హాకీ ట్రైనింగ్ తీసుకున్నానని. ఇదే క్యారెక్టర్లో దాదాపు ఒక ఏడాదిగా ఉండటం.. 14 కిలోల బరువు తగ్గడం విశేషాలని ఆయన తెలిపారు.
ఇదిలా వుంటే క్లైమాక్స్ సీక్వెన్స్‌లు ఫెంటాస్టిక్‌గా వచ్చాయని, సినిమాకి ఇవి పెద్ద హైలైట్ అవుతాయని చిత్రయూనిట్ తెలిపింది.