అశోక్ జిల్లాలో అభివృద్ధి ఇదీ అంటున్న వైసీపీ

ఆయన కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. సాధారణంగా ఇంతటి కీలకమైన శాఖను సౌత్ స్టేట్స్ కి గత ప్రభుత్వాలు ఇచ్చింది లేదు. మోడీ ప్రభుత్వం మాత్రం 2014లో విజయనగరం నుంచి ఎంపీగా…

ఆయన కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. సాధారణంగా ఇంతటి కీలకమైన శాఖను సౌత్ స్టేట్స్ కి గత ప్రభుత్వాలు ఇచ్చింది లేదు. మోడీ ప్రభుత్వం మాత్రం 2014లో విజయనగరం నుంచి ఎంపీగా గెలిచిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు కట్టబెట్టింది. ఇది నిజంగా సువర్ణ అవకాశం

అప్పట్లోనే విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ని నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ అదే శాఖకు చెందిన మంత్రిగా అశోక్ ఉన్నారు. పైగా సొంత జిల్లా ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంది. అయినా ఎయిర్ పోర్టు మాత్రం కాగితాలకే పరిమితం అయింది.

ఎయిర్ పోర్టు కోసం మొదట అయిదు వేల ఎకరాలను భూసేకరణ చేయాలని టీడీపీ సర్కార్ భావించిన జనాల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో తగ్గి మూడు వేలకు ప్రతిపాదించింది. అయితే ఆ భూసేకరణ కూడా ఒక కొలిక్కి రాకముందే హడావుడిగా నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసేశారు. విశేషం ఏంటి అంటే నాటి శంకుస్థాపనకు సంబంధిత శాఖ మంత్రి అశోక్ రాలేదు, కారణాలు తెలియరాలేదు.

బాబు శంకుస్థాపన అయితే చేశారు కానీ రైతులు కోర్టుకెళ్ళడంతో భూసేకరణ అలా నిలిచిపోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసేకరణను వేగవంతం చేసింది. కోర్టు నుంచి ఈ మధ్యనే సానుకూల ఫలితాలు రావడంతో ఎట్టకేలకు అవాంతరాలు తొలగాయి.

ఎంతో కాలంగా ఉత్తరాంధ్రా ప్రజలు ఎదురుచూస్తున్న భోగాపురం ఎయిర్ పోర్టుకి మే నెల వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. జీఎమ్మార్ సంస్థ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపడుతుంది. రెండేళ్ల వ్యవధిలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు.

ఈ ఎయిర్ పోర్టు రెండు వేల రెండు వందల ఎకరాలలో నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టుతో విశాఖ విజయనగరం జిల్లాలు రెండూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందనున్నాయి. జంట నగరాలుగా రూపాంతరం చెందనున్నాయి. భోగాపురం భీమిలీ బీచ్ కారిడార్ కొత్తగా రెడీ కానుంది. టూరిజానికి అది ఊతం ఇచ్చెలా ప్రాజెక్టులు రానున్నాయి. 

ఉత్తరాంధ్రాకు వైసీపీ ఏమి చేసింది అని తరచూ ప్రశ్నించే కేంద్ర మాజీ మంత్రి అశోక్ సొంత జిల్లాలోనే ఆయన హయాంలో అడుగు కూడా కదలని ఎయిర్ పోర్టుని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.