ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాకు సీక్వెల్?

సూర్య కెరీర్ లోనే విలక్షణ సినిమాల్లో ఒకటి 24. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం కథాపరంగానే కాకుండా, సూర్య క్యారెక్టరైజేషన్ పరంగా కూడా బెస్ట్ అనిపించుకుంది. ఇందులో సూర్య…

సూర్య కెరీర్ లోనే విలక్షణ సినిమాల్లో ఒకటి 24. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం కథాపరంగానే కాకుండా, సూర్య క్యారెక్టరైజేషన్ పరంగా కూడా బెస్ట్ అనిపించుకుంది. ఇందులో సూర్య పోషించిన ఆత్రేయ పాత్ర అతడి కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. ఐదేళ్ల కిందట రిలీజైన ఈ సినిమా, ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది.

అవును.. 24 సినిమాకు సీక్వెల్ రాబోతోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతేకాదు, ఈ ఏడాదిలోనే సూర్య ఈ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 2 సినిమాలున్నాయి. వీటిలో ఒకటి ఆల్రెడీ పూర్తయింది. మిగతా ప్రాజెక్టు కూడా కొలిక్కి వచ్చిన వెంటనే, 24 సీక్వెల్ స్టార్ట్ అవుతుంది.

ఇక విక్రమ్ కుమార్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ దర్శకుడు నాగచైతన్యతో థ్యాంక్యూ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పని పూర్తయిన వెంటనే 24 సీక్వెల్ పని స్టార్ట్ చేస్తాడు విక్రమ్ కుమార్.

సీక్వెల్ కు కావాల్సిన లక్షణాలన్నీ 24 సినిమాకున్నాయి. కాకపోతే అందరూ ఊహించే విధంగా కథలు, సన్నివేశాలు ఎత్తుకోవడం విక్రమ్ కుమార్ కు ఇష్టం ఉండదు. కాబట్టి సీక్వెల్ కూడా కచ్చితంగా కొత్తగా ఉండబోతోందని చెప్పొచ్చు. 24లో హీరోయిన్ గా నటించిన సమంతను, సీక్వెల్ లో కూడా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.