బాలయ్య చిన్నల్లుడికి జనసేన గండం

ఇద్దరు రాజకీయ ఉద్దండుల మనవడిగా, సినీ నటుడు బాలయ్య చిన్నల్లుడిగా లోకేష్‌ తోడల్లుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన గీతం విద్యా సంస్ధళ చైర్మన్‌ శ్రీ భరత్‌ రాజకీయం ఒక స్ధాయిలో ఉండాలి.  Advertisement కానీ…

ఇద్దరు రాజకీయ ఉద్దండుల మనవడిగా, సినీ నటుడు బాలయ్య చిన్నల్లుడిగా లోకేష్‌ తోడల్లుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన గీతం విద్యా సంస్ధళ చైర్మన్‌ శ్రీ భరత్‌ రాజకీయం ఒక స్ధాయిలో ఉండాలి. 

కానీ ఆయనకు 2019లో మొదటి ప్రయత్నంలోనే టీడీపీ టిక్కెట్‌ లభించడం దుర్లభం అయిపోయింది. తీరా టిక్కెట్‌ తెచ్చుకున్నా త్రిముఖ పోటీలో  ఓటమి తప్పలేదు. దాంతో శ్రీభరత్‌ నిరుత్సాహపడి కొంతకాలం రాజకీయాల మీద విరక్తి పెంచుకున్నారు. 

గత ఏడాదిగా మళ్లీ ఆయన చురుకుగా కనిపిస్తున్నారు. ఆరు నూరు అయినా 2024 ఎన్నికలలో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని శ్రీ భరత్‌ పట్టుబడుతున్నారు. అయితే శ్రీ భరత్‌కు ఆశ ఉన్నా దాని కంటే ఎక్కువగా ఆటంకాలు కూడా ఉన్నాయని అంటున్నారు. 

తెలుగుదేశం అధినాయకత్వం ఆయనకు ఎంపీ టిక్కెట్‌ ఇస్తుందా అన్నది ఓ సందేహంగా ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు ఈ టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఒకవేళ బీజేపీ కూడా పొత్తులో చేరితే ఆ పార్టీకి ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 

మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును లోక్‌సభ బరిలోకి దింపాలని కూడా బాబు ఆలోచనగా ఉందని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో యువనేత శ్రీ భరత్‌కు అన్నీ ఉన్నా కూడా నోటికి అందే భాగ్యం ఉందా అన్నదే చూడాలని అంటున్నారు.