కేవలం బ్యాకింగ్ వుంటే హీరోలు అయిపోరు అని, సత్తా ప్రూవ్ చేసుకుంటేనే నిలదొక్కుకుంటారని నిర్మాత దిల్ రాజు అన్నారు. గతంలో బ్యాకింగ్ తో చాలా మంది వచ్చారని కానీ ఎక్కడున్నారని ఆయన ఓ ఇంటర్వూలో ప్రశ్నించారు.
రాఘవేంద్రరావు, దాసరి లాంటి దర్శకులు పుల్ ఫామ్ లో వున్నపుడు సైతం వాళ్ల పిల్లలు హీరోలుగా నిలదొక్కుకోలేకపోయారన్నారు.
బ్యాకింగ్ లేకుండా నాని లాంటి హీరో తన లాంటి నిర్మాత నిలదొక్కుకున్నారని ఆయన గుర్తు చేసారు. తన సోదరుడి కుమారుడు ఆశిష్ కు కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటేనే కంటిన్యూటీ వుంటుందని లేదంటే వుండదని స్పష్టం చేసారు.
తను ఎంత డబ్బులు వచ్చాయని చూడడం లేదని, రౌడీబాయిస్ సినిమాను ఎంత మంది చూసారు అన్నదే లెక్కవేస్తున్నా అని ఆయన అన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్ కనిపిస్తోందని, కానీ అలా అని ఏవి పడితే అవి తీస్తే సరిపోదని, మంచి కంటెంట్ తో రావాలని దిల్ రాజు అన్నారు.