Advertisement

Advertisement


Home > Movies - Movie News

శుభారంభం కుదిరింది.. సక్సెస్ మిగిలింది

శుభారంభం కుదిరింది.. సక్సెస్ మిగిలింది

‘కథ వేరుంటది’ అనే మేనరిజమ్ తో గతేడాది బిగ్ బాస్ షోలో హల్చల్ చేశాడు తెలుగు కుర్రాడు సయ్యద్ సోహెల్. బిగ్ బాస్ లో టాప్ త్రీ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సోహెల్ హీరోగా వస్తోన్న సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. టైటిల్ తోనే అందర్నీ ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు సాంగ్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. కథ వేరుంటది అనే సాహిత్యంతో సాగే పాటను ఫస్ట్ లిరికల్ వీడియోగా విడుదల చేశారు.

శ్రావణ్ భరధ్వాజ్ సంగీతం అందించిన ఈ పాటకు ఇప్పుడు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. బుల్లెట్ బండి పాటతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన మోహన భోగరాజు పాటని పాడింది. సాంగ్ సక్సెస్ తో సోహెల్ కు మంచి శుభారంభం దొరికినట్టయింది. ఇక మిగిలింది సక్సెస్ మాత్రమే. అది కూడా కొడితే బిగ్ బాస్ నుంచి హీరోగా మారి సక్సెస్ అందుకున్న తొలి హీరోగా అవతరిస్తాడు సోహెల్.

బిగ్ బాస్ నుంచి ఇప్పటివరకు చాలామంది విజేతలుగా బయటకొచ్చాడు. మరికొంతమంది తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొని బయటకొచ్చారు. కానీ అలా బయటకొచ్చిన వాళ్లలో ఒక్కరు కూడా వెండితెరపై క్లిక్ అవ్వలేకపోయారు. చివరికి బిగ్ బాస్ కు ఓ ఊపు తీసుకొచ్చిన కౌశల్ కూడా సినిమాల్లో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో సోహెల్ హిట్ కొడితే, అది రికార్డ్ అవుతుంది.

ప్రస్తుతానికైతే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ మోడ్ లో ఉంది. సినిమాకు సంబంధించి మరో సాంగ్ ను వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేయబోతున్నారు. శ్రీనివాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను అప్పిరెడ్డి, రవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇంతకుముందు జార్జిరెడ్డి సినిమా తీసింది వీళ్లే. సోహెల్ కోసం సినిమాలో మంచి పాడింగ్ సెట్ చేసి పెట్టారు వీళ్లు. సుహాసిని, బ్రహ్మాజీ, అలీ, రాజారవీంద్ర.. ఇలా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?