ఉద్యోగుల్లారా మాట్లాడుకుందాం రండి!

ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం ఉద్యోగుల డిమాండ్ల‌పై దృష్టి సారించింది. నూత‌న పీఆర్సీ వ‌ద్ద‌ని , డిమాండ్ల ప‌రిష్కారానికి ఉద్య‌మ‌మే శ‌ర‌ణ్య‌మంటూ ఉద్యోగులు  కార్యాచ‌ర‌ణ‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌భుత్వం స‌మ‌స్య‌ను కొలిక్కి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు…

ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం ఉద్యోగుల డిమాండ్ల‌పై దృష్టి సారించింది. నూత‌న పీఆర్సీ వ‌ద్ద‌ని , డిమాండ్ల ప‌రిష్కారానికి ఉద్య‌మ‌మే శ‌ర‌ణ్య‌మంటూ ఉద్యోగులు  కార్యాచ‌ర‌ణ‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌భుత్వం స‌మ‌స్య‌ను కొలిక్కి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. 

ఇందులో భాగంగా పీఆర్సీ సాధ‌న స‌మితి నాయ‌కుల‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రి పేర్ని నాని చ‌ర్చ‌ల‌కు ఆహ్వానం ప‌లికారు. అయితే ప్ర‌భుత్వంతో చ‌ర్చించేందుకు ఉద్యోగ సంఘాల నాయ‌కులు సిద్ధంగా లేన‌ట్టు వారి స్పంద‌న తెలియ‌జేస్తోంది. 

స్టీరింగ్ క‌మిటీలో చ‌ర్చించిన త‌ర్వాత త‌మ నిర్ణ‌యం వుంటుంద‌ని వారు ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌కు స‌మాచారం ఇచ్చారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే తాము చర్చలకు వస్తామని సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. దీంతో ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌నేది ఉత్కంఠ రేపుతోంది.

నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ ఇవాళ్టి నుంచి ఉద్యోగులు ఉద్య‌మానికి స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ స‌మావేశాలు నిర్వ‌హించారు. అంచెలంచెలుగా ఉద్య‌మాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలో చ‌ర్చించుకున్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

ఇదిలా ఉండ‌గా ఉద్యోగులు పూర్తిగా స‌హాయ నిరాక‌ర‌ణ చేసి ప్ర‌భుత్వాన్ని లొంగ‌దీసుకోవాల‌నే రీతిలో ముందుకెళ్లాల‌ని ఉన్న‌ట్టు వారి వ్యూహాలున్నాయి.