ఏంటో సెలబ్రిటీల సెటైర్లు కూడా వెరైటీగా వుంటాయి. హీరో నవదీప్ స్టడీగా ఒకే పొజిషన్ లో దశాబ్దానికి పైగా వుండిపోయాడు. ఎదుగు లేదు. అలా అని తగ్గిపోయిందీ లేదు.
ఆ ముచ్చట అలా వుంచితే మనవాడు చాలా మంది తెలుగు హీరోల మాదిరిగానే పక్కా బ్యాచులర్ గా మిగిలిపోతున్నాడు. సోషల్ మీడియాలో ఎవరో ఏదో కెలికినట్లున్నారు. దానికి నవదీప్ ఓ సరదా సెటైర్ వేసాడు.
'అన్నా గెడ్డం తెల్లబడుతోంది పెళ్లి చేసుకో అంటున్నారు. గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి. పెళ్లి కాదు' అన్నాడు. అక్కడితో ఆగకుండా 'దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం' అన్నాడు.
ఇదే చిత్రంగా వుంది….సరదా పుడితే తీర్చుకోవాలి కానీ పెళ్లి దాకా వెళ్లాలా? అనే మీనింగ్ తో అన్నాడా? మరేమైనా మీనింగ్ వుందా? అని అనుమానాలు, సమాధానాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.