నాని అంటే జెంటిల్ మన్. కానీ హీరో నానిని జెంటిల్ మన్ గా చూపించిన దర్శకుడు ఇంద్రగంటినే ఇప్పుడు రాక్షసుడు అంటున్నాడు. వి అనే పేరుతో ఇంద్రగంటి చేస్తున్న సినిమా వ్యవహారమే ఇది.
తుపాకి పట్టకుని సుధీర్ బాబు ను రక్షకుడిగా పరిచయం చేసిన ఇంద్రగంటి, మరో హీరో నాని ని మాత్రం రాక్షసుడు అంటే రక్తపు మరకులు వున్న కత్తెర చేతితో పట్టుకుని వున్నట్లు పరిచయం చేసారు.
వి సినిమాలో నాని ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. థ్రిల్లర్ జోనర్ సినిమాలో సీరియల్ కిల్లర్ గా నాని కనిపిస్తారని టాక్. సినిమాల్లో హీరో మర్డర్లు చేసినా, ఏదో లోక కళ్యాణమో, స్వ కళ్యాణమో వుండే వుంటుంది. అయితే అంత మాత్రం చేత ఏకంగా రాక్షసుడు అనేస్తున్నారు అంటే, నాని క్యారెక్టర్ కాస్త సీరియస్ గా, భయంకరంగానే వుంటుందేమో?
ఇంద్రగంటి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. నాని తో ఇంద్రగంటి చేస్తున్న మూడో సినిమా ఇది.