మొహమాటానికి పోతున్న మైత్రీ

సినిమా రంగంలో కొన్ని మొహమాటాలు వుంటాయి. పేరు పడిన ప్రతి సినిమాలో భాగస్వామ్యం వుండదు. రిలేషన్స్ తో కొన్ని పేర్లు వుట్టినే తగిలిస్తారు. కావాలని కొన్ని యాడ్ చేస్తారు. తెరవెనుక అసలు లెక్కలు వేరే…

సినిమా రంగంలో కొన్ని మొహమాటాలు వుంటాయి. పేరు పడిన ప్రతి సినిమాలో భాగస్వామ్యం వుండదు. రిలేషన్స్ తో కొన్ని పేర్లు వుట్టినే తగిలిస్తారు. కావాలని కొన్ని యాడ్ చేస్తారు. తెరవెనుక అసలు లెక్కలు వేరే వుంటాయి. మైత్రీ మూవీస్ సంస్థ నుంచి వచ్చిన మీటర్ సినిమా ఆ సంస్థకు బ్యాడ్ నేమ్ తెచ్చింది. ఇలాంటి సినిమాలు నిర్మించడం ఏమిటి అని సోషల్ మీడియాలో జనం ఆడేసుకుంటున్నారు.

బన్నీ..ప్రభాస్..రామ్ చరణ్..పవన్ ఇలా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ మధ్యలో ఇలాంటి సినిమాలు చేయడం ఏమిటి అని కామెంట్ చేస్తున్నారు. నిజానికి విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం మైత్రీ మూవీస్ కు మీటర్ సినిమాకు సంబంధం లేదు. జస్ట్ సమర్పించు అనే ట్యాగ్ లైన్ మాత్రమే. మీటర్ నిర్మాత చెర్రీ. ఈయన మైత్రీ సంస్థకు సిఇఓ. అక్కడ ఆ పని చేస్తూనే తను స్వంతంగా చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు.

మత్తువదలరా అనే చిన్న సినిమా చేసారు. మంచి పేరు వచ్చింది డబ్బులు కూడా వచ్చాయి. తరువాత హ్యపీ బర్త్ డే అనే సినిమా ఇప్పుడు మీటర్ సినిమా నిర్మించారు. వీటికి కూడా డబ్బులు వచ్చాయి కానీ సక్సెస్ రాలేదు. ఓ చిన్న సినిమా నాన్ థియేటర్ మార్కెట్ కావాలి అంటే ఓ పెద్ద బ్యానర్ అండ వుండాలి. అలాంటి ఆలోచనతోనే మైత్రీ పేరు యాడ్ చేసినట్లు తెలుస్తోంది. తమ సంస్థ సిఇఓ కనుక మైత్రీ అధినేతలు కూడా కాదని అనలేరు.

కానీ ఇప్పుడేమవుతోంది ఇలాంటి చిన్న ఫ్లాప్ సినిమాలు చేయడం వల్ల మైత్రీ రిప్యుటేషన్ దెబ్బతింటోంది. క్వాలిటీ సినిమాలు తీస్తారని మార్కెట్ లో మంచి పేరు వుంది. ఇప్పుడు అది కాస్తా దెబ్బతింటోంది. ఇండస్ట్రీ ఇన్ సైడ్ జనాలకు అసలు విషయం తెలుసు. కానీ బయట వారికి తెలియదు. అందుకే మైత్రీ సంస్థ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.