2019 రిపీట్.. అంటున్న నారా లోకేష్!

త‌న పాద‌యాత్ర ఆరంభమై నల‌భై రోజులు గ‌డిచే స‌రికే మార్పు మొద‌లైంద‌ని ఆ మ‌ధ్య ప్ర‌క‌టించుకున్నారు నారా లోకేష్. మ‌రి ఆయ‌న‌కు ఏం మార్పు క‌నిపించిందో కానీ, ఆయ‌న మాట తీరులో మాత్రం పెద్ద…

త‌న పాద‌యాత్ర ఆరంభమై నల‌భై రోజులు గ‌డిచే స‌రికే మార్పు మొద‌లైంద‌ని ఆ మ‌ధ్య ప్ర‌క‌టించుకున్నారు నారా లోకేష్. మ‌రి ఆయ‌న‌కు ఏం మార్పు క‌నిపించిందో కానీ, ఆయ‌న మాట తీరులో మాత్రం పెద్ద మార్పు లేదు. 

ఒక‌టి మాట్లాడ‌బోయి మ‌రోటి మాట్లాడ‌టం, నోరు జార‌డం, ప‌దాలు అర్థ ర‌హితంగా ప‌ల‌క‌డం.. ఆది నుంచి నారా లోకేష్ శైలి ఇది. ఇలాంటి విష‌యాల్లో నారా లోకేష్ ది ఆల్ టైమ్ రికార్డే. మ‌రి ఇలా పాద‌యాత్ర‌లో రోజూ మాట్లాడుతూ ఉంటే అయినా లోకేష్ తీరు మారుతుంద‌ని టీడీపీ వీరాభిమానులు కూడా ఆశించిఉండ‌వ‌చ్చు. అయితే అలాంటిదేమీ లేన‌ట్టుగా ఉంది వ్య‌వ‌హారం.

నారా లోకేష్ తాజా ప్ర‌సంగాలు కూడా బోలెడ‌న్ని బూతులు వెదుక్కువ‌డానికి త‌గిన రీతినే సాగుతూ ఉన్నాయి. ఏదేదో మాట్లాడుతూ త‌లా తోక లేని రీతిలో నారా లోకేష్ మాట‌లు సాగుతూ ఉన్నాయి. ఇదే క్ర‌మంలో ఆయ‌న మరో విష‌యాన్ని సెల‌విచ్చారు. పాద‌యాత్ర‌లో త‌మ వారి ఉత్సాహం చూస్తూ ఉంటే 2019 రిపీట్ అయ్యేలా ఉందంటూ లోకేషుడు ప్ర‌క‌టించారు!

మ‌రి ఇంత‌కీ 2019 రిపీట్ కావ‌డం అంటే ఏమిటో అంటూ తెలుగు త‌మ్ముళ్లే త‌ల‌ప‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 2019లో తెలుగుదేశం పార్టీ దాని చ‌రిత్ర‌లోనే అత్యంత దారుణ‌మైన ఓట‌మిని ఎదుర్కొంది. ఆవిర్బావం ద‌గ్గ‌ర నుంచి ఏనాడూ లేని రీతిలో కేవ‌లం 23 సీట్ల‌కు, మూడు ఎంపీ సీట్ల‌కు ప‌రిమితం అయ్యింది. ఆ ఓట‌మి ఒక లెక్క అయితే ప్ర‌త్య‌ర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయి మెజారిటీలు ద‌క్కాయి. పాత రికార్డులు బ‌ద్ధ‌ల‌య్యాయి. కంచుకోట‌లుగా పేరున్న నియోక‌వ‌ర్గాల్లో కూడా టీడీపీ చిత్తు చిత్తుగా ఓట‌మి పాలైంది. స్వ‌యంగా నారా లోకేష్ కూడా ఓట‌మి పాల‌యిన సంగ‌తీ తెలిసిందే!

మ‌రి తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే 2019 రిపీట్ అయ్యేలా ఉందన్న నారా లోకేష్ వ్యాఖ్య‌లు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు క‌ల‌వ‌రాన్ని క‌లిగించ‌గ‌ల‌వు. ఏం చెప్ప‌ద‌లుచుకున్నాడో కానీ.. 2019 రిపీట్ అయ్యేలా ఉంద‌న్న లోకేష్ వ్యాఖ్య‌లు విని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు త‌థాస్తూ అంటూ ఉండ‌గా, తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు మాత్రం చెవులు మూసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్టుగా ఉంది!