మొదలవుతున్నాయి కానీ… వచ్చేదెప్పుడో?

కరోనా ఎప్పటికి తగ్గుముఖం పడుతుందో తెలియదు. వాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు. నెలల తరబడి ఇంటికే పరిమితమైన వాళ్లంతా ఇక బయటకు రాక తప్పడం లేదు.  Advertisement ఈ నేపథ్యంలో తెలుగు…

కరోనా ఎప్పటికి తగ్గుముఖం పడుతుందో తెలియదు. వాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు. నెలల తరబడి ఇంటికే పరిమితమైన వాళ్లంతా ఇక బయటకు రాక తప్పడం లేదు. 

ఈ నేపథ్యంలో తెలుగు సినిమా స్టార్ హీరోలందరూ పనుల్లో పడుతున్నారు. సీనియర్ హీరోలు కూడా ఇక రిస్కు తీసుకోక తప్పదని నిలిచిపోయిన సినిమాలు తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్లారు. 

ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, వకీల్ సాబ్ తదితర భారీ చిత్రాలన్నీ ముందుకు కదిలాయి. షూటింగ్ అసలు మొదలే పెట్టని పుష్ప కూడా అడవుల్లోకి వెళ్లింది. సర్కారు వారి పాట చిత్రాన్ని మహేష్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు. 

ఈ సినిమాలన్నీ మొదలయితే అవుతున్నాయి కానీ రిలీజ్ ఎప్పుడనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. రాధేశ్యామ్, ఆచార్య వేసవిలో విడుదలవుతాయని అంటున్నారు. 

మరి సర్కారు వారి పాట, పుష్ప వచ్చే దసరాకి వస్తాయా లేక 2022 సంక్రాంతి వరకు ఆగుతాయా అనేది తెలియదు. ఆర్.ఆర్.ఆర్. రిలీజ్ డేట్ ఏమిటనే దానిపై మిగిలిన భారీ సినిమాల రిలీజ్ ప్లాన్స్ ఆధారపడతాయి. 

ఇదిలావుంటే ఇంతవరకు థియేటర్లు పూర్తి స్థాయిలో ఆపరేట్ అయ్యేదెపుడు, కొత్త సినిమాలు విడుదలయ్యేదెపుడు అంటే సీనియర్ నిర్మాతలే సమాధానం చెప్పలేకపోతున్నారు. 

రాజ్యాంగం విఫలం అయిందనడం ధర్మమేనా?