పుష్ప2 వీడియో ప్రచారానికి 4 కోట్లు!

పుప్ప2 సినిమా నుంచి వేర్ ఈజ్ పుష్ప అంటూ ఓ చిన్న వీడియో వచ్చింది. పుష్ప పార్ట్ 2 మీద మామూలు బజ్ కాదు..వీర బజ్ వుంది. ఇప్పుడు ఈ బజ్ ను మరింత…

పుప్ప2 సినిమా నుంచి వేర్ ఈజ్ పుష్ప అంటూ ఓ చిన్న వీడియో వచ్చింది. పుష్ప పార్ట్ 2 మీద మామూలు బజ్ కాదు..వీర బజ్ వుంది. ఇప్పుడు ఈ బజ్ ను మరింత పెంచాలి. ఓటిటి కి మంచి రేటు రప్పించుకోవాలి. 

బజ్ ను ఇప్పటి నుంచి పెంచుకుంటూ వెళ్తే, సినిమా విడుదల టైమ్ కు అది ఆకాశమంత ఎత్తుకు లేస్తుంది. అలా జరగాలంటే సినిమా నుంచి వదిలే ప్రతి కంటెంట్ వైరల్ కావాలి. మిలియన్లకు మిలియన్ల వ్యూస్ రావాలి. అది కూడా కేవలం తెలుగులో కాదు. హిందీలో, ఇతర భాషల్లో. ఇలా చేయాలంటే ఎంత ఖర్చు చేయాలి?

వేర్ ఈజ్ పుష్ప అన్న వీడియోకే ఇప్పుడు నాలుగు కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వైరల్ కావడానికి వ్యూస్ కోసం ఆ మాత్రం ఖర్చు అవసరం పడుతోందని తెలుస్తోంది. అసలే బన్నీ ఇలాంటి విషయాల్లో చాలా కీలకంగా వుంటారు. ప్రతి చిన్న విషయాన్ని కీలకంగా తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ రేంజ్ లోకి వెళ్లాల్సిందే పుష్ప2 అన్ని విషయాల్లో.

ఇలా జరగాలంటే పుష్ప 2 నిర్మాతలు పబ్లిసిటీ కోసం డబ్బులు జల్లాల్సిందే. అందుకే నాలుగు కోట్లు కావడం అన్నది చాలా చిన్న విషయం కావచ్చు.