ప్రేమించాడు.. పెళ్లి మాటెత్తగానే చంపేశాడు

ప్రేమ అంటూ మాయ మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటాడని ఆమె ఆశపడింది. కానీ అతడు మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు. మరి తన సంగతేంటని అడిగిన యువతిని పథకం ప్రకారం హత్య చేశాడు. తెలంగాణలోని…

ప్రేమ అంటూ మాయ మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటాడని ఆమె ఆశపడింది. కానీ అతడు మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు. మరి తన సంగతేంటని అడిగిన యువతిని పథకం ప్రకారం హత్య చేశాడు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగింది ఈ దారుణం.

ఆత్మకూరుకు చెందిన శ్రీనివాసులు, శ్వేత దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. కొన్ని రోజులుగా శ్వేతను దూరం పెట్టాడు శ్రీనివాసులు. ఈ క్రమంలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న శ్వేత, శ్రీనివాసుల్ని నిలదీసింది. తన సంగతేంటని ప్రశ్నించింది. కొన్నాళ్లుగా ఈ విషయంపై శ్వేతను మభ్యపెడుతూ వస్తున్నాడు శ్రీనివాసులు. కానీ శ్వేత మాత్రం పట్టువదలకపోవడంతో ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

పెళ్లికి సంబంధించి మాట్లాడ్డానికి వస్తున్నానని శ్వేత చెప్పడంతో శ్రీనివాసులు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. జడ్చెర్ల బస్టాండ్ లో ఆమెను పికప్ చేసుకున్నాడు. తన బైక్ పై అమరచింత ప్రాంతానికి తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న తాడుతో శ్వేతను చంపేశాడు. తర్వాత తన బైక్ లో ఉన్న పెట్రోల్ తీసి తగలబెట్టాడు.

మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, యువతి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ఆధారంగా యువతిని గుర్తించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా శ్రీనివాసుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందింతుడు కూడా తను చేసిన నేరాన్ని అంగీకరించాడు.

నాకు పెగ్గు అలవాటు లేదు