ఆ అమ్మాయి ఉద్యోగం ఎందుకు పోయినట్లో?

రాజకీయ నాయకులకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేం అన్న సంగతి తెలిసిందే. ఓ రాజకీయ నాయుకుడి కారణంగా ఢిల్లీలోని ఓ ఛానెల్ రిపోర్టర్ ఉద్యోగం పోయిందనే గుసగుసలు  మీడియా సర్కిళ్లలో వినిపిస్తోంది. ఇటీవల…

రాజకీయ నాయకులకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేం అన్న సంగతి తెలిసిందే. ఓ రాజకీయ నాయుకుడి కారణంగా ఢిల్లీలోని ఓ ఛానెల్ రిపోర్టర్ ఉద్యోగం పోయిందనే గుసగుసలు  మీడియా సర్కిళ్లలో వినిపిస్తోంది. ఇటీవల ఓ బడా ఆశలు వున్న ఓ చోటా పార్టీ అధినేత ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఓ తెలుగు ఛానెల్ ప్రతినిధి, ఆ నాయకుడిని 'మీ పార్టీని ఫలానా పార్టీలో ఎప్పుడు విలీనం చేస్తున్నారు' అని అడిగారు. దానికి ఆయన కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి తప్పించుకున్నారు.

తరువాత ఓ జాతీయ పార్టీ నేత ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాట్లు చేసారు. అక్కడికీ ఈ రిపోర్టర్ వచ్చారు. మరి అక్కడ ఏం జరిగిందో ఏమో, మళ్లీ అదే క్వశ్చను వేసారు. అప్పుడూ అంతగా సమాధానం రాలేదని తెలుస్తోంది. కానీ ఆ తరువాత మరేమైందో ఏమో, ప్రస్తుతం ఆ ఛానెల్ నుంచి సదరు రిపోర్టర్ ను తప్పించేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు, అదే ఛానెల్ కు వున్న మరో రిపోర్టర్ ను సెలవులో పంపినట్లు తెలుస్తోంది.

డబ్బులతో రాజకీయాలు చేసేవాళ్లం కాదు

ప్రజలు చీకొట్టిన వాళ్ళ ఆమోదం అవసరమా