ఇంటి పేరు ధర్మాన, మనిషి తీరు కూడా అలాగే ఉంటుంది. ఎంతసేపూ తన నియోజకవర్గం, తమ ప్రజలు, తమ పరిధిలో ఉంటే పెద్ద మనిషి ధర్మాన క్రిష్ణ దాస్. ఆయన ఉప ముఖ్యమంత్రి గా ప్రమోట్ కాగానే జోరు పెంచేసారు. వైసీపీకి కొత్త జోష్ తెచ్చేశారు.
ఆయన తాజాగా చేసిన హాట్ హాట్ కామెంట్స్ టీడీపీ శిబిరానికి షాకింగ్ గానే చూడాలి. టీడీపీ విపక్షంగా విఫలం అయింది. చంద్రబాబు ప్రతిపక్ష పాత్రను సరిగ్గా పోషించలేకపోతున్నారు. దాంతోనే టీడీపీ ఎమ్మెల్యేలు మా వైపునకు క్యూ కడుతున్నారు.
మేము కనుక డోర్స్ తీస్తే టీడీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో కూడా చెప్పడం కష్టమేనని దీపావళి బాంబునే టీడీపీ నెత్తిన వేశారు. అంతే కాదు చంద్రబాబు విపక్ష హోద కూడా డేంజర్ లో పడుతోంది అని జోస్యం చెప్పేశారు.
మరి ధర్మాన వంటి వారు చెబితే అది ఉత్త మాట ఎందుకు అవుతుంది. అసలే శీతాకాల సమావేశాల ముందు బాబు విపక్ష హోదాకు షాక్ ఇచ్చేలా వైసీపీ పావులు కదుపుతోందన్న టాక్ అయితే ఉంది. దానికి ఆధారంగా ధర్మాన మాటలను తీసుకుంటే మాత్రం దీపావళి బాంబు ఏకంగా టీడీపీ మీదనే పడినట్లుంది అంటున్నారు.
తన ఎమ్మెల్యేలు ఎవరూ గీత దాటరు అనుకుంటూ బాబు ఈ మధ్యనే భారీ ఎత్తున పార్టీ పదవులు కూడా పందేరం చేశారు. ఆ పదవులు కూడా వదిలేసి వారు గోడ దాటితే అంతకంటే పరువు తక్కువ మరోటి ఉంటుందా… ఏది ఏమైనా ఆపరేషన్ టీడీపీ స్టార్ట్ అయినట్లుగానే ఉంది. ధర్మాన చెప్పాక అది సత్యమే అవుతుంది కూడా.