బోయపాటికి హ్యాండిచ్చిన కేథరిన్

బాలయ్య సినిమాలకు అన్నింటి కన్నా కష్టమైన విషయం హీరోయిన్లు దొరకడం. ప్రతి సినిమాకు అదే సమస్య. అయితే బోయపాటి డైరక్షన్లో చేసే సినిమాకు ఆయన మొహమాటంతో కేథరిన్ సీన్ లోకి వచ్చింది. ఆమె బాలయ్య…

బాలయ్య సినిమాలకు అన్నింటి కన్నా కష్టమైన విషయం హీరోయిన్లు దొరకడం. ప్రతి సినిమాకు అదే సమస్య. అయితే బోయపాటి డైరక్షన్లో చేసే సినిమాకు ఆయన మొహమాటంతో కేథరిన్ సీన్ లోకి వచ్చింది. ఆమె బాలయ్య సరసన చేయడానికి సూత్ర ప్రాయంగా ఓకె అన్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే లేటెస్ట్ విషయం ఏమిటంటే ఆమె ఇప్పుడు సీన్లోంచి తప్పుకుంది. అసలు బాలయ్య సరసన చేయడానికి కేథరిన్ ఓకె అన్నట్లు వార్తలు వచ్చినపుడే సినిమా జనాలకు ఆశ్చర్యం కలిగింది. ఆమె ఎలా ఒకె అన్నట్లా? అని. అయితే బోయపాటి తో వున్న పరిచయం, సినిమాల అనుబంధంతో ఓకె అని వుంటుంది అని అనుకున్నారు. కానీ ఇఫ్పుడు ఆమె మనసు మార్చుకుని నో అన్నట్లు వార్తలు రావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.

బోయపాటి ప్రస్తుతం ఆయన తల్లి గారి మరణంతో డీలా పడి వున్నారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇప్పడిప్పుడే మళ్లీ రోటీన్ లోకి వస్తున్నారు. అన్నీ సెట్ అయి బాలయ్య తో సినిమా స్టార్ట్ కావడానికి ఎంతకాలం పడుతుందో అన్నది ఇప్పుడే సమాధారం దొరకని ప్రశ్న.

సైరా లాస్ ఎంత? 

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' స్పెషల్ ఇంటర్వ్యూ