మహేష్ సినిమాకు సోనీ?

మహేష్ సినిమాలను ఎవరు నిర్మిస్తారు అన్నది చివరి వరకు కాస్త సస్సెన్స్ గానే వుంటుంది. మహర్షి సినిమా విషయంలో కోర్టుల వరకు వెళ్లింది నిర్మాణ వ్యవహారం. ఆఖరికి అశ్వనీదత్, పివిపి, దిల్ రాజు ముగ్గురు…

మహేష్ సినిమాలను ఎవరు నిర్మిస్తారు అన్నది చివరి వరకు కాస్త సస్సెన్స్ గానే వుంటుంది. మహర్షి సినిమా విషయంలో కోర్టుల వరకు వెళ్లింది నిర్మాణ వ్యవహారం. ఆఖరికి అశ్వనీదత్, పివిపి, దిల్ రాజు ముగ్గురు కలిసి నిర్మించారు. ఆ తరువాత సినిమా సరిలేరు నీకెవ్వరు కు అనిల్ సుంకర  సోలో ప్రొడ్యూసర్. కానీ మహర్షి లావాదేవీల కోసం దిల్ రాజు పేరు కూడా నిర్మాతగా చేర్చారు. అలాగే మహేష్ స్వంత సంస్థ జిఎమ్మీ కూడా చేరింది. 

కానీ దిల్ రాజు మధ్యలోనే తప్పుకున్నారు. పేరు మాత్రం వుంచారు. అనిల్ సుంకర నే సోలోగా సినిమాను నిర్మించారు. దిల్ రాజుకు వేరే విధంగా కాపన్ సేట్ చేసారు. ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాను దిల్ రాజే నిర్మించాల్సి వుంది. కానీ వంశీ పైడిపల్లికి అడ్వాన్స్ ను దిల్ రాజు-పివిపి కలిపి ఇచ్చారు కనుక, మళ్లీ పివిపి కూడా సీన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తోందని కొద్దిరోజుల క్రితమే వెల్లడించాం.

అయితే బాలీవుడ్ సంస్థ అయిన సోనీ కూడా మహేష్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకునే ఉద్దేశంలో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ నిర్మాణ సంస్థ అయిన జిఎమ్బీ తో సోనికి వ్యాపార బంధాలు వున్నాయి. ఆ బంధాలతోనే తెలుగులో మహేష్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణం దగ్గరకు వచ్చాక కానీ ఈ విషయంలో క్లారిటీ రాదు.

సైరా లాస్ ఎంత?

రామోజీరావుని సూటిగా అడుగుతున్నా

కింగ్ ఆఫ్ కామెడీ మా అందరికి గాడ్ ఫాదర్ బ్రహ్మానందం‌గారు