రవితేజ అస్సలు వెనక్కు తగ్గడం లేదు. డిస్కోరాజా లో డబుల్ రోల్ చేసిన తరువాత టాగోర్ మధు నిర్మిస్తున్న క్రాక్ సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్ మీద వుండగానే రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా అనౌన్స్ చేసారు. గతంలో ఈ ఇద్దరు కలిసి ఓ ఫ్లాపు సినిమా ఇచ్చారు. మళ్లీ అదే రమేష్ వర్మతో చేయబోయే సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ ను ఎక్కడి నుంచో రీమేక్ రైట్స్ తీసుకుని తెచ్చినట్లు వినిపిస్తోంది. లేదా రమేష్ వర్మ ఏదైనా పాయింట్ తో కథ తయారుచేసారో మరి. మొత్తం మీద రవితేజ అయితే డబుల్ రోల్ చేస్తున్నారట.
క్రాక్ సినిమా దగ్గర నుంచి రవితేజ తన రెమ్యూనిరేషన్ విషయంలో పద్దతులు కాస్త మార్చారు అని టాక్. గతంలో ఎటువంటి ఈక్వేషన్లు లేకుండా కేవలం డైరక్ట్ గా రెమ్యూనిరేషన్ మాత్రమే తీసుకునే రవితేజ, క్రాక్ సినిమాకు, అలాగే రమేష్ వర్మ సినిమాకు ఆ పద్దతిని చాలా వరకు సడలించినట్లు తెలుస్తోంది.