నీది నీచపు జీవితం.. నిన్ను రొచ్చులో తొక్కుతారు

ఇద్దరు ఎంపీల తిట్ల పురాణం ఇది. వాళ్లే విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజు. కొన్ని రోజులుగా వీళ్ల విమర్శల-ప్రతివిమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. నీది నీచపు జీవితం అని విజయసాయి అంటే.. ప్రజలు నిన్ను రొచ్చులో…

ఇద్దరు ఎంపీల తిట్ల పురాణం ఇది. వాళ్లే విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజు. కొన్ని రోజులుగా వీళ్ల విమర్శల-ప్రతివిమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. నీది నీచపు జీవితం అని విజయసాయి అంటే.. ప్రజలు నిన్ను రొచ్చులో తొక్కే రోజు దగ్గర్లోనే ఉందని రఘురామ అందుకున్నారు. అసలు ఈ తిట్ల పురాణం ఎక్కడ మొదలైందో చూద్దాం.

ముందుగా విజయసాయి ఎత్తుకున్నారు…

“ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలట! ఎన్నుకున్న వారిని  వదిలేసి ఢిల్లీలో కూర్చున్న నీలో ఉన్నస్ఫూర్తి ఏంటో? బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెట్టడమా? ఓట్లు వేసిన వారికే ముఖం చూపించలేని నీ పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా? ఆరడుగులున్నా అన్నీ మరుగుజ్జు ఆలోచనలే!”

4 రోజుల కిందట విజయసాయి వేసిన ట్వీట్ ఇది. అంతకంటే ముందు నుంచే రఘురామపై విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఈ ట్వీట్ నుంచే వేడి ఎక్కువగా రాజుకుంది. దీనికి రఘురామ కూడా అదే టైపులో కౌంటర్ ఇచ్చారు.

“నువ్వు, నీ ఏ1 నన్ను ఎంత కవ్వించి రప్పించి చంపాలని చూస్తున్నారో నాకు తెలీదా ఏ2. ఇంటి నుంచి బయటకు పరదాలు కట్టుకుని ఎవరు వస్తున్నారో అందరికీ తెలుసు. ముందు నువ్వు, నీ ఏ1 కోర్టుకి హాజరు అవ్వండి. నా కేసులు నేను చూసుకుంటానులే ఏ2. మీలాగే మీ ఆలోచనలు కూడా మరగుజ్జే!”

ఇక్కడితో అయిపోయిందనుకునేలోపే విజయసాయి మరో పంచ్ వేశారు. దానికి కౌంటర్ గా రఘురామ కూడా అంతే ఘాటుగా స్పందించారు. అవేంటో బ్యాక్ టు బ్యాక్ చూద్దాం

విజయసాయి ట్వీట్:  జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా!  ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు…నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్ మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!

రఘురామ కౌంటర్: ఆవునా? నా జీవితం నీకు ఏ1 కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు పాపం వివేకానంద రెడ్డి లా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది Mr. ఏ2!

నిన్నటివరకు ఇలాసాగిన వీళ్ల తిట్లపురాణం.. ఈరోజు కొత్త మలుపు తీసుకుంది. ఢిల్లీలో కూర్చొని కాకమ్మ కథలు చెబుతున్నారంటూ విజయసాయి విమర్శిస్తే.. ప్రజలు త్వరలోనే రాళ్లతో కొడతారంటూ రఘురామ తగులుకున్నారు.

విజయసాయి ట్వీట్: ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ళకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్ళే రాళ్లతో కొడతారు.

రఘురామ కౌంటర్: నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో.

ఇలా 5 రోజులుగా ఈ ఇద్దరు ఎంపీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే ఉంది. బహుశా డైలీ సీరియల్ గా ఇది మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.