సినీ సెలబ్రిటీల మనసులను వారి సోషల్ మీడియా ఖాతాలు ప్రతిబింబిస్తున్నాయి. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోతున్నారని వారి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నెటిజన్లు పసిగట్టారు. సమంత తన పేరుతో పాటు ఉన్న అక్కినేని తొలగించడంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలే చివరికి నిజమయ్యాయి.
తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ దఫా తన ఇన్స్టాగ్రామ్ నుంచి నాగచైతన్యతో విడిపోతు న్నట్టు ప్రకటించిన పోస్టును ఆమె తొలగించారు. ఇప్పుడిదే చర్చకు దారి తీస్తోంది.
తాము పరస్పరం అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు అక్టోబర్ 2న విడాకులకు సంబంధించి సమంత, నాగచైతన్య తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.
తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని ఇద్దరూ ఒకే విషయాన్ని వ్యక్తిగతంగా తమతమ పేర్లతో ప్రకటన ఇవ్వడం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో సదరు ప్రకటనను సామ్ తొలగించడంతో మళ్లీ ఏమైనా వాళ్లిద్దరూ కలుసుకుంటున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున టాలీవుడ్లో జరుగుతోంది. కానీ నాగచైతన్య మాత్రం ఆ పోస్టును కంటిన్యూ చేస్తుండడం గమనార్హం.
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో పాటు తొలగించే వాటి వెనుక కూడా ఓ కథ ఉంటుందనేది తెలిసిందే. అందుకే ప్రత్యేకంగా ఆ పోస్టును మాత్రమే తొలగించడం వెనుక కారణం ఏమై వుంటుందబ్బా అని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.