రామ్ తో తొలి రోజు.. శ్రీలల ఏం చెప్పిందంటే..!

రామ్, శ్రీలీల కలిసి నటించిన సినిమా స్కంద. వీళ్లిద్దరిది ఫ్రెష్ కాంబినేషన్. గతంలో కూడా ఎప్పుడూ కలుసుకోలేదు. మరి తొలి రోజు వీళ్లిద్దరి మధ్య షూటింగ్ ఎలా నడిచింది? ఇదే ప్రశ్న శ్రీలీలకు ఎదురైంది.…

రామ్, శ్రీలీల కలిసి నటించిన సినిమా స్కంద. వీళ్లిద్దరిది ఫ్రెష్ కాంబినేషన్. గతంలో కూడా ఎప్పుడూ కలుసుకోలేదు. మరి తొలి రోజు వీళ్లిద్దరి మధ్య షూటింగ్ ఎలా నడిచింది? ఇదే ప్రశ్న శ్రీలీలకు ఎదురైంది. దీనిపై స్పందించిన హీరోయిన్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

“స్కంద సినిమా షూట్ లో రామ్ తో మొదటి రోజు షూటింగ్. దూరందూరంగా నిల్చున్న సీన్ అది. ఇటు ఫ్యామిలీతో నేను, అటు రామ్ ఉన్నారు. ఆయన నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నారు. తొలి రోజు కదా హాయ్ చెబుదామని ట్రై చేశాను. ఆయన ఎటు చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. షాట్ అయిన తర్వాత కలిశాను. చాలా సేపట్నుంచి హాయ్ చెబుతున్నానని నాకు నేనుగా చెప్పుకోవాల్సి వచ్చింది. అది చాలా ఫన్నీగా అనిపించింది. నా లైఫ్ లో చాలా కామెడీ సీన్లు జరుగుతుంటాయి. నా లైఫ్ లో నేనే పెద్ద కమెడియన్. వేరే వ్యక్తి అక్కర్లేదు.”

ఇలా తొలిరోజు, రామ్ ను పరిచయం చేసుకున్న విధానం చాలా ఫన్నీగా సాగినట్టు చెప్పుకొచ్చింది. ఇక యాక్టింగ్ విషయానికొస్తే, తనకు నటించడం రాదని అంటోంది శ్రీలీల. ఇప్పటివరకు ఆమె యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవ్వలేదట.  

“ఏ సినిమాకైనా నేను హోమ్ వర్క్ చేస్తాను. ముందు రోజే సీన్ ప్రిపేర్ అవుతాను. కానీ ఇప్పటివరకు యాక్టింగ్ స్కూల్ కు వెళ్లలేదు. ప్రతి సినిమాతో నటించడం నేర్చుకుంటున్నాను. ప్రతి మూవీ నాకు ఓ యాక్టింగ్ క్లాస్. ప్రతి డైరక్టర్ నాకు నేర్పిస్తున్నారు. నేను డాన్స్ నేర్చుకున్నాను, యాక్టింగ్ నేర్చుకోలేదు. క్లాసికల్ డాన్సర్ ను కాబట్టి ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ ఎక్స్ ప్రెషన్స్ ను తగ్గించాలని అర్థమైంది. ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను.”

స్కంద సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకొస్తోంది ఈ బ్యూటీ. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ చిన్నది, అవన్నీ ఒకేసారి ఓకే చేసినవి కాదంటోంది. స్కంద సినిమాను పెళ్లిసందడి తర్వాత సైన్ చేసిందట. దీంతో పాటు మరో 3 సినిమాల్ని పెళ్లిసందడి మూవీ టైమ్ లోనే ఓకే చేశానని చెబుతోంది.