ఈనాడులో వెనుక‌బడ్డ‌.. చంద్ర‌బాబు అరెస్ట్!

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అరెస్టుపై అనేక మంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నార‌ని, చాలా మంది వృద్ధుల‌కు బాబు అరెస్టు త‌ర్వాత గుండెపోటు వ‌చ్చింద‌ని, కొంద‌రైతే నిద్రాహారాలు మాని…

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అరెస్టుపై అనేక మంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నార‌ని, చాలా మంది వృద్ధుల‌కు బాబు అరెస్టు త‌ర్వాత గుండెపోటు వ‌చ్చింద‌ని, కొంద‌రైతే నిద్రాహారాలు మాని చంద్ర‌బాబుపై బెంగ పెట్టేసుకున్నార‌ని ఈనాడు ప్రింట్ ఎడిష‌న్లో క‌థ‌నాలు క‌నిపిస్తున్నాయి!

మ‌రి ప్రింట్ ఎడిష‌న్ ముచ్చ‌ట పాత‌దే! త‌న అజెండాను అచ్చేయ‌డంలో ఈనాడు ట్రాక్ రికార్డు గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! అవ‌త‌ల చంద్ర‌బాబు అరెస్టు అయితే ఆయ‌న త‌న‌యుడే ఢిల్లీ నుంచి తిరిగిరావ‌డం లేదు! అయితే జ‌నాలు మాత్రం విప‌రీతంగా బెంగ‌ట్టేసుకున్నార‌ని ఈనాడు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తోంది!

మ‌రి ప్రింట్ క‌థాక‌మామీషును ప‌క్క‌న పెడితే.. ఈనాడు డాట్ నెట్ లో మాత్రం చంద్ర‌బాబు వార్త‌ల ప‌ట్ల పెద్ద ఆస‌క్తి క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం! ఈనాడులో చంద్ర‌బాబు అరెస్టుపై లెక్క‌కు మించి క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే.. మోస్ట్ వ్యూడ్ కేట‌గిరిలో మాత్రం.. చంద్ర‌బాబు వార్త‌లు స్థానం సంపాదించ‌లేక‌పోతున్నాయి! అది కూడా ఈనాడులో!

ఎంత‌లా అంటే.. చంద్ర‌బాబు అరెస్టు, నారా భువ‌నేశ్వ‌రి, నారా బ్ర‌హ్మ‌ణీ వార్త‌లు, కోర్టులో పిటిష‌న్లు, తెలుగుదేశం నేత ఖండ‌న‌మండ‌న‌లు.. ఇన్ని వార్త‌లున్నా.. ఈనాడులో టాప్ వ్యూస్ లో ఉన్న‌ది.. టీ20లో నేపాల్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌! చంద్ర‌బాబు అరెస్టుపై ప్ర‌పంచమంతా స్పందించేస్తోంద‌ని ఒక‌వైపు చెబుతున్నారు. అయితే ఈనాడు డాట్ నెట్ లో ఉంతో లేదో తెలియ‌ని నేపాల్ క్రికెట్ జ‌ట్టు ఫెర్ఫార్మెన్స్ పై ఉన్న ఆస‌క్తి చంద్ర‌బాబు పిటిష‌న్ల మీద‌నో, నారా భువ‌నేశ్వ‌రి ఆవేద‌న మీద‌నో లేక‌పోవ‌డం విశేషం!

అంత‌కు మించిన విష‌యం.. కొంద‌రికి టికెట్లను ఇవ్వ‌ను అని జ‌గ‌న్ చెప్పిన‌ట్టుగా ఒక క‌థ‌నాన్ని ఇవ్వ‌గా.. అది టాప్ త్రీలో ఉంది! చంద్ర‌బాబు అరెస్టు క‌న్నా.. జ‌గ‌న్ సూఛాయ‌గా చేసిన ప్ర‌క‌ట‌నే ఈనాడులో టాప్ లో నిలిచింది!

చంద్ర‌బాబు అరెస్టుపై ప్ర‌పంచం బెంగేట్టేసుకుంద‌ని ప్ర‌చారం చేస్తున్న మీడియా వ‌ర్గంలో.. వారం ప‌ది రోజుల నుంచి కూడా ఇలా వేరే వార్త‌ల‌న్నీ టాప్ వ్యూస్ పొందుతున్నాయి కానీ, చంద్ర‌బాబు వార్త‌ల ప‌ట్ల మాత్రం కాస్తంత ఆస‌క్తైనా లేకుండా పోయిందే! చంద్ర‌బాబు తోపు అని త‌రుమ‌ని నిప్పు అని.. ఈనాడులో అన్ని క‌థ‌నాలు ప‌బ్లిష్ అవుతుంటే.. క‌నీసం ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా టాప్ టెన్లో కూడా లేదు! భ‌జ‌న‌, సానుభూతి.. అన్ని ప్ర‌య‌త్నాలూ జ‌ర‌గుతున్నాయి. కానీ జనాల‌కు కాస్తైనా ప‌డుతున్న‌ట్టుగా లేదు! ప‌చ్చ‌వ‌ర్గాలు ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించుకుంటున్నాయా?