ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజ‌నాకు ప‌రాభ‌వం

బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, మాజీ కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రికి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప‌రాభ‌వం ఎదురైంది. దీంతో ఆయ‌న తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించాడు.  Advertisement ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారుల అడ్డ‌గింత‌తో ఆయ‌న అమెరికా ప్ర‌యాణం అర్ధాంత‌రంగా ఆగిపోయిందని…

బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, మాజీ కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రికి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప‌రాభ‌వం ఎదురైంది. దీంతో ఆయ‌న తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించాడు. 

ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారుల అడ్డ‌గింత‌తో ఆయ‌న అమెరికా ప్ర‌యాణం అర్ధాంత‌రంగా ఆగిపోయిందని స‌మాచారాం. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సుజ‌నాచౌద‌రిపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.

దీంతో అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సుజ‌నాచౌద‌రిని అక్క‌డి ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అడ్డుకున్నారు. త‌న‌ను ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అక్ర‌మంగా అడ్డుకున్నారని, న్యాయం చేయాల‌ని కోరుతూ  సుజ‌నాచౌద‌రి తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఈ నేప‌థ్యంలో సుజ‌నాచౌద‌రికి జ‌రిగిన ప‌రాభ‌వం వెలుగు చూసింది.

సుజనా గ్రూపు సంస్థలు బ్యాంకులకు ఏకంగా రూ.5,700 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టాయ‌ని  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  గ‌తంలో ఆరోపించింది. ఇంత భారీ మొత్తంలో బ్యాంకుల‌కు  ఎగవేశాయనేందుకు త‌మ‌కు బ‌ల‌మైన ఆధారాలు ల‌భించాయ‌ని ఈడీ స్ప‌ష్టం చేసింది. కాగా సుజనా గ్రూప్‌ సంస్థలపై ఫెమా, డీఆర్‌ఐ, సీబీఐ కేసులు నమోదైన విష‌యం తెలిసిందే.  

యూట్యూబ్ రిపోర్టర్ల పరిస్థితి ఏంటి..?