ఫొటోకు కూడా ఓ భాష ఉంటుంది. భావోద్వేగాలను రగిల్చే శక్తి ఫొటోకు ఉంటుంది. అందుకే వెయ్యి పదాలు చెప్ప గలిగే భావాన్ని ఒకే ఒక్క ఫొటో ప్రకటిస్తుందంటారు. ఫొటోకు ఏదో తెలియని ఆకర్షణా శక్తి ఉంటుంది. అందులో మనసును లోబరుచుకునే అతేంద్రీయ శక్తి ఏదో దాగి ఉంటుంది.
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హాట్ లుక్ ఫొటో కుర్రకారును మత్తెక్కించేలా ఉంది. మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఆ అందాల తార, ఆ తర్వాత అల్లరి పిడుగు సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో బిజీగా గడుపుతున్నారు.
ఈ సుందరి మాల్దీవుల్లోని బీచ్‌లో తన అందచందాలను ప్రదర్శిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఇసుక తిన్నెలపై రెడ్ డ్రెస్ లో సీరియస్‌గా ఏదో ఆలోచిస్తున్నట్టు అభిమానుల్ని అలరిస్తూ కనిపించారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణం లేకపోలేదు.
కళ్లకు కాటుక, అందంతో పోటీ పడేలా ఎరుపు రంగు దుస్తుల్లో సూర్యకాంతి పడిన నీటి బిందువులా ఆమె మెరిసిపోతూ నెటిజన్లను కట్టి పడేస్తున్నారు. పేరుకు తగ్గట్టే తన అందంతో కుర్రకారుకు “కైప్” ఎక్కిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో!